సారథి, జగిత్యాల రూరల్: నరేంద్రమోడీ ప్రధానమంత్రి గా బాధ్యతలు చేపట్టి ఏడేళ్లు విజయవంతంగా పూర్తిచేసుకున్న సందర్భంగా ఆదివారం జగిత్యాల రూరల్ మండలం పోరండ్లలో బీజేపీ చీఫ్ బండి సంజయ్ ఆదేశాల మేరకు కొవిడ్ పేషెంట్లకు పండ్లు, మాస్కులు, శానిటైజర్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో బీజేపీ జగిత్యాల రూరల్ మండల ఉపాధ్యక్షుడు నాగిరెడ్డి రాజిరెడ్డి, రురల్ మండల కోశాధికారి మెడపట్ల లక్ష్మణ్, బీజేవైఎం మండల ప్రధాన కార్యదర్శి పడిగెల మహిపాల్ రెడ్డి, బీజేపీ నాయకులు వంగ మధుకర్ రెడ్డి, […]
సారథి, జగిత్యాల రూరల్: జగిత్యాల రూరల్ మండలం లక్ష్మీపూర్ గ్రామంలో మహిళా సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కట్టె గానుగ ద్వారా నూనె తయారీ కేంద్రాన్ని ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ప్రారంభించారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహిళా సంఘాలు ఆర్థికంగా బలోపేతం కావడమే ప్రభుత్వ లక్ష్యమని, అందుకనుగుణంగా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. శ్రీనిధి, బ్యాంకుల ద్వారా లోన్లు ఇస్తూ ఆర్థికంగా అండగా ఉంటుందన్నారు. జడ్పీ చైర్ పర్సన్ దావ వసంత సురేష్ […]
సారథి, జగిత్యాల రూరల్: లాక్ డౌన్ నేపథ్యంలో జగిత్యాల రూరల్ మండలం ధరూర్ గ్రామంలోని ఎస్ఆర్ఎస్పీ కెనాల్ వద్ద పోలీస్ చెక్ పోస్ట్ ఏర్పాటు చేశారు. లాక్ డౌన్ నిబంధనలను ఉల్లంఘించకుండా జగిత్యాల రూరల్ ఎస్సై చిరంజీవి తనిఖీలు చేపడుతున్నారు. అత్యవసరమైతేనే బయటికి రావాలని, లేదంటే ఏదైనా ముఖ్యమైన పనిఉంటే 10 గంటలలోపే పూర్తిచేసుకోవాలని సూచించారు. కరోనా నేపథ్యంలో తీసుకుంటున్న చర్యలకు ప్రజలు సహకరించాలని కోరారు.
సారథి, జగిత్యాల రూరల్: జగిత్యాల రూరల్ మండలంలోని తక్కళ్లపెల్లిలో సర్పంచ్ గడ్డం జైపాల్ రెడ్డి, ఉపసర్పంచ్ నల్లాల విక్రమ్ గురువారం పారిశుద్ధ్య సిబ్బందితో కలిసి శానిటైజేషన్ చేయించారు. కరోనా నేపథ్యంలో ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని పలు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు వారు వెల్లడించారు. ప్రతిఒక్కరూ మాస్క్ లు ధరించాలని, అత్యవసరం అయితేనే బయటకు రావాలని, ఎవరికైనా కరోనా అని అనుమానంగా ఉంటే వెంటనే ఆరోగ్య కేంద్రానికి వెళ్లి టెస్ట్ చేయించుకోవాలని సర్పంచ్ గడ్డం జైపాల్ రెడ్డి, ఉప […]
సారథి న్యూస్, జగిత్యాల: జగిత్యాల జిల్లా వెల్గటూరు మండలం స్తంభంపల్లి గ్రామశివారులో బీసీ గురుకుల పాఠశాల నిర్మాణానికి ఐదెకరాలు, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విజ్ఞాన భవన్ నిర్మాణానికి ఎకరా, హరిత హోటల్ నిర్మాణానికి ఐదెకరాల చొప్పున కేటాయించిన స్థలాన్ని బుధవారం రాష్ట్ర సంక్షేమ, మైనార్టీ సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ సహకారంతో ధర్మపురి నియోజకవర్గాన్ని అన్నిరంగాల్లో తీర్చిదిద్దేందుకు పనిచేస్తున్నామని అన్నారు. 40 ఏళ్లలో లేని విధంగా అంబేద్కర్ […]
హైదరాబాద్: మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శి ముప్పాళ్ల లక్ష్మణరావు అలియాస్ గణపతి లొంగుబాటుపై మూడు నాలుగు రోజులుగా మీడియాలో వస్తున్న కథనాలపై ఆ పార్టీ కేంద్ర కమిటీ స్పందించింది. అవన్నీ కల్పిత కథలేనని కొట్టిపారేసింది. ఈ మేరకు అధికార ప్రతినిధి అభయ్పేరుతో లేఖను విడుదల చేసింది. ‘గణపతి సరెండర్ ఒక హైటెన్షన్ కల్పిత కథ, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆడుతున్న నాటకం, తెలంగాణ, చత్తీస్‌గఢ్ ఇంటలిజెన్స్ అధికారుల కట్టు కథలతో పాటు, పోలీసులు అల్లిన నాటకం. […]
వరంగల్: జగిత్యాల అడిషనల్ ఎస్పీ దక్షిణమూర్తి కరోనాతో మృతిచెందారు. వరంగల్ ఉమ్మడి జిల్లాలో అత్యధిక కాలం పాటు సేవలు అందించిన పోలీస్ ఆఫీసర్గా గుర్తింపు ఉంది. వారం రోజుల క్రితం కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడంతో కరీంనగర్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందారు. ఆరోగ్య పరిస్థితి విషమించడంతో చనిపోయారు. మేడారం స్పెషల్ఆఫీసర్గా మంచి అనుభవం ఉంది. 1989 బ్యాచ్ ఎస్సై ద్వారా పోలీస్ శాఖలోకి వచ్చిన దక్షిణమూర్తి ఉమ్మడి వరంగల్, ఖమ్మం జిల్లాల్లోని పలు […]
సారథి న్యూస్, కరీంనగర్: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం రాఘవపట్నం గ్రామానికి చెందిన సూక్ష్మకళాకారుడు గాలిపెల్లి చోళేశ్వర్ చారి సోమవారం పెన్సిల్ మొనపై అమరవీరుల స్థూపాన్ని చెక్కాడు. అమరవీరులను స్మరిస్తూ ఉద్యమ జ్ఞాపకాలను గుర్తుచేస్తుందని, ఇది ఆ అమరవీరులకు అంకితమిస్తున్నానని ఆయన పేర్కొన్నారు.