Breaking News

IPL

మొక్కలు నాటుతాం.. డబ్బు సాయం చేస్తాం

ఐపీఎల్‌ ఫ్రాంచైజీ కోల్‌కతా నైట్‌రైడర్స్‌ కోల్‌కతా: ఎంఫాన్​ తుఫాన్‌ దాటికి దెబ్బతిన్న ప్రాంతాలను ఆదుకోవడానికి ఐపీఎల్‌ ఫ్రాంచైజీ కోల్‌కతా నైట్‌రైడర్స్‌ ముందుకొచ్చింది. ఇందులో భాగంగా పశ్చిమ బెంగాల్‌ సీఎం సహాయ నిధికి డబ్బులు ఇవ్వడంతో పాటు కోల్‌కతా అంతటా ఐదు వేల మొక్కలను నాటేందుకు సిద్ధమైంది. ఈ మేరకు రాష్ట్రాన్ని ఆదుకునేందుకు తాము కట్టుబడి ఉన్నామని కేకేఆర్‌ ట్వీట్‌ చేసింది. ‘గత దశాబ్దకాలంలో ఇంత పెద్ద తుఫాన్‌ను చూడలేదు. చాలా నష్టం సంభవించింది. జరిగిన నష్టాన్ని పూడ్చేందుకు […]

Read More

ఐపీఎల్ కు అనుమతి తప్పనిసరి

న్యూఢిల్లీ: ఐపీఎల్ భవిష్యత్ పై సందేహాలు వెంటాడుతూనే ఉన్న నేపథ్యంలో కేంద్ర క్రీడల మంత్రి కిరణ్ రిజిజు కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్ర ప్రభుత్వం అనుమతిస్తేనే ఐపీఎల్ జరుగుతుందని వ్యాఖ్యానించారు. ఈ విషయంలో బీసీసీఐ సొంతంగా నిర్ణయం తీసుకునే అవకాశాల్లేవని స్పష్టం చేశారు. ‘కరోనా వైరస్ నియంత్రణలోకి వచ్చిన తర్వాతే ఐపీఎల్ పై నిర్ణయం ఉంటుంది. వైరస్ వ్యాప్తి ఆధారంగానే ఈ నిర్ణయం ఉంటుంది. టోర్నీలు నిర్వహించాలనే ఏకైక కారణంతో ప్రజల ప్రాణాలను ఫణంగా పెట్టలేం. ప్రస్తుతం […]

Read More

ధోనీని గుర్తుకు తెస్తాడు

వెటరన్ ప్లేయర్ సురేశ్ రైనా ముంబై: ఐపీఎల్లో చెన్నై సూపర్​ కింగ్స్​కు పోటీ ఇవ్వగల జట్టు ఏదైనా ఉందంటే అది ముంబై ఇండియన్స్. కెప్టెన్ రోహిత్​ రాకతో మరింత బలంగా తయారైన ముంబై.. నాలుగుసార్లు టైటిల్స్​ను కూడా కొల్లగొట్టింది. అయితే కెప్టెన్సీ విషయంలో కొన్నిసార్లు రోహిత్.. ధోనీని గుర్తుకు తెస్తాడని వెటరన్ ప్లేయర్ సురేశ్ రైనా అన్నాడు. కొన్ని లక్షణాలు అచ్చం మహీని పోలి ఉంటాయన్నాడు. ‘ప్రశాంతత, ఆటగాళ్లకు ప్రేరణ కల్పించడంలో ధోనీలాగా వ్యవహరిస్తాడు. కెప్టెన్సీ కూడా […]

Read More

ఐపీఎలే బెస్ట్

ఇంగ్లండ్ బ్యాట్స్​మెన్ జోస్ బట్లర్ న్యూఢిల్లీ: ఇంగ్లండ్ క్రికెట్ బాగా అభివృద్ధి చెందడానికి ఐపీఎల్ చాలా దోహదపడిందని ఆ దేశ బ్యాట్స్​మెన్​ జోస్ బట్లర్ అన్నాడు. ఐసీసీ ప్రపంచకప్​ల తర్వాత ఐపీఎల్ బెస్ట్ టోర్నీ అని కితాబిచ్చాడు. ఈసారి లీగ్ జరిగితే బాగుంటుందని ఆశాభావం వ్యక్తంచేశాడు. ‘ఇంగ్లిష్ క్రికెట్ పురోగతి సాధించడానికి ఐపీఎల్ చాలా సాయం చేసింది. ఇందులో ఎలాంటి సందేహం లేదు. కొన్నేళ్లుగా ఎంతో మంది క్రికెటర్లు ఇందులో ఆడుతున్నారు. వాళ్లంతా ఆటపరంగా, ఆర్థికంగా చాలా […]

Read More

టీ20 వరల్డ్​కప్​ వాయిదా?

వచ్చే వారం ఐసీసీ అధికారిక ప్రకటన న్యూఢిల్లీ: కరోనా దెబ్బకు ఇప్పటికే పలు టోర్నీల రద్దుతో అస్తవ్యస్తమైన క్రీడా ప్రపంచానికి ఇప్పుడు మరో దెబ్బ పడనుంది. ప్రతిష్టాత్మక టీ20 ప్రపంచకప్​ కూడా వైరస్​ ఖాతాలో పడేలా కనిపిస్తోంది. అక్టోబర్​, నవంబర్​లో జరగాల్సిన ఈ టోర్నీని వాయిదావేసే దిశగా ఐసీసీ వేగంగా అడుగులు వేస్తోంది. ఈనెల 26 నుంచి 28వ తేదీ వరకు జరిగే గవర్నింగ్​ బాడీ సమావేశంలో దీనిపై తుదినిర్ణయం తీసుకోనున్నారు. ఒకవేళ ఈవెంట్​ను వాయిదా వేస్తే […]

Read More

బుమ్రాను తీసుకొమ్మంటే వినలేదు

వెటరన్ వికెట్ కీపర్ పార్థివ్ పటేల్ న్యూఢిల్లీ: ఒకప్పుడు అనామక బౌలర్. కానీ ఇప్పుడు ఐసీసీ ర్యాంకింగ్స్​లో రెండవ ర్యాంకర్. డెత్ ఓవర్​లో బౌలింగ్ అంటే ఠక్కున గుర్తొచ్చేది జస్ప్రీత్ బుమ్రా. అయితే ఐపీఎల్ తొలినాళ్లలో బుమ్రాను రాయల్ చాలెంజర్స్ బెంగళూరు టీమ్​లోకి తీసుకోవాలని చెప్పినా విరాట్ కోహ్లీ పట్టించుకోలేదట. ఈ విషయాన్ని వెటరన్ వికెట్ కీపర్ పార్థివ్ పటేల్ వెల్లడించాడు. బుమ్రా గొప్ప బౌలర్ అవుతాడని ఊహించే.. తాను కోహ్లీకి చెప్పానన్నాడు. ‘విదర్భపై అరంగేట్రం చేసినప్పుడు […]

Read More

క్రికెట్ మొదలుపెట్టొచ్చు

ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ మెల్‌ బోర్న్‌: కరోనా వైరస్ నియంత్రణలోకి వచ్చిన తర్వాత క్రికెట్​ను సురక్షితంగా మొదలుపెట్టడానికి ఐపీఎల్ మంచి మార్గమని ఆస్ర్టేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ అన్నాడు. అక్టోబర్, నవంబర్​లో జరిగే టీ20 ప్రపంచకప్​ సన్నాహకంగా ఉపయోగపడుతుందన్నాడు. ఈ సీజన్​లో ఏదో ఓ దశలో ఐపీఎల్ జరుగుతుందని కమిన్స్ ఆశాభావం వ్యక్తంచేశాడు. ‘నేను లాక్​ డౌన్​లో ఉన్నా కోల్​ కత్తా మేనేజ్​మెంట్​ తో మాట్లాడుతూనే ఉన్నాం. వాళ్లందరూ ఐపీఎల్ జరుగుతుందనే నమ్మకంతోనే ఉన్నారు. కాబట్టి […]

Read More
ఐపీఎల్ జరుగుతుంది

ఐపీఎల్ జరుగుతుంది

ఆర్‌సీబీ డైరెక్టర్‌ మైక్‌హెస్సన్‌ ముంబై: కరోనా దెబ్బకు ఐపీఎల్‌ నిరవధికంగా వాయిదా పడినా చాలా మందికి లీగ్‌పై నమ్మకం పోలేదు. ఈ ఏడాది ఏదో ఓ టైమ్‌లో కచ్చితంగా ఐపీఎల్‌ జరిగి తీరుతుందని రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు(ఆర్‌సీబీ) క్రికెట్‌ ఆపరేషన్స్‌ డైరెక్టర్‌ మైక్‌హెస్సన్‌ ఆశాభావం వ్యక్తం చేశాడు. లీగ్‌ ఎప్పుడు జరిగినా ఆర్‌సీబీ రెడీగా ఉంటుందన్నాడు. ‘మాకు ఇంకా నమ్మకం ఉంది. ఐపీఎల్‌కు టైమ్‌ ముగిసిపోలేదు. కచ్చితంగా జరిగి తీరుతుంది. పరిస్థితులను సమీక్షించిన తర్వాత బీసీసీఐ దీనిపై […]

Read More