సామాజిక సారథి, వరంగల్: వరంగల్ ఎనుమాముల మార్కెట్ లో మిర్చి ధర మంగళవారం పెరగడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సోమవారం రూ.18వేలు పలికిన వండర్ హాట్ మంగళవారం రూ.18500, 341 రకం 17500, తేజ రకం రూ.15400 ఉన్నట్టు అధికారులు తెలిపారు. మార్కెట్లో పత్తికూడా రికార్డు ధర పలికింది. రూ.8715 పలికినట్లు మార్కెట్ అధికారులు తెలిపారు. సీజన్ లో పత్తి ధర ఈ విధంగా పలకడం ఇదే మొదటిసారి కావడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు
సారథి న్యూస్, పెద్ద శంకరంపేట: కరోన తీవ్రత కొనసాగుతోంది. మెదక్ జిల్లా పెద్దశంకరంపేట పీహెచ్సీలో గురువారం 28 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా ఇద్దరికి పాజిటివ్ వచ్చింది. ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని.. అత్యవసరమైతేనే బయటకు రావాలని వైద్యఅధికారులు సూచిస్తున్నారు. కొంతమంది అజాగ్రత్త వల్ల మిగతావారు ఇబ్బందుల పాలవుతున్నారని చెప్పారు.
న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ విజృంభిస్తున్నది. కొత్తకేసులు ప్రమాదకరస్థాయిలో పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో రికార్డుస్థాయిలో 32 వేల కొత్తకేసులు నమోదయ్యాయంటే పరిస్థితి ఏ రేంజ్లో ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. కొన్ని రాష్ట్రాల్లో ఇప్పటికే టెస్టులు సరిగ్గా చేయడం లేదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటివరకు భారత్లో 9,68,876 కేసులు నమోదయ్యాయి. 6,12,814 మంది ఈ వ్యాధి నుంచి కోలుకున్నారు. ఇప్పటికి 24, 915 మంది ప్రాణాలు కోల్పోయారు. 3,31,146 యాక్టివ్ కేసులు ఉన్నాయి. భారత్ లాంటి […]
న్యూఢిల్లీ: కోవిడ్-19 కేసులసంఖ్య భారత్లో అంతకంతకూ పెరుగుతున్నది. కేవలం గత నాలుగు రోజుల్లేనే లక్షకేసులు నమోదయ్యాయంటే పరిస్థితి ఏ రేంజ్లో ఉందో అర్థం చేసుకోవచ్చు. కాగా ఇప్పటివరకు మొత్తం కేసులసంఖ్య 8,49,553కు చేసింది. గత 24 గంటల్లో 28,637 కొత్త కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు కరోనా బారిన పడి 22,674 మంది ప్రాణాలు కోల్పోయారు. దేశవ్యాప్తంగా శనివారం 2,80,151 మందికి కరోనా పరీక్షలు చేసినట్టు ఐసీఎంఆర్ తెలిపింది.