సారథి న్యూస్, కర్నూలు: మహిళ అభివృద్ధి, శిశుసంక్షేమశాఖ మంత్రి తానేటి వనిత ఆధ్వర్యంలో 13 జిల్లాల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అంగన్వాడీ కేంద్రంలో ‘నాడు నేడు’ పనులను త్వరగా పూర్తిచేయాలన్నారు. చిన్నారులకు ఆహ్లాదమైన వాతావరణం ఉండాలన్నారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రతిష్టాత్మకంగా అమలుచేస్తున్న ‘వైఎస్సార్ సంపూర్ణ పోషణ’, ‘పోషణ’ కార్యక్రమాలను జాగ్రత్తగా నిర్వహించాలని సూచించారు. సమావేశంలో ప్రిన్సిపల్ సెక్రటరీ అనురాధ, డైరెక్టర్ కృత్తికా శుక్లా, జేడీ అడ్మిన్ శ్రీలత, ఆర్జేడీలు శైలజ, ఉమారాణి, చిన్మయదేవి పాల్గొన్నారు.
సారథి న్యూస్, శ్రీకాకుళం: ప్రభుత్వ భవనాల్లోనే అంగన్వాడీ సెంటర్లు ఉండాలని, అందుకు ‘నాడు..నేడు’ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని మహిళాశిశు సంక్షేమశాఖ, ఐసీడీఎస్ పథక సంచాలకులు డాక్టర్జి.జయలక్ష్మి సీడీపీవోలను ఆదేశించారు. శనివారం ఉదయం ఆమె సమీక్షించారు. అంగన్వాడీ సెంటర్లకు ప్రభుత్వ స్థలాన్ని గుర్తించి నివేదిక తమకు అందిస్తే వాటిని జేసీకి పంపిస్తామన్నారు. ప్రస్తుతం ఉన్న భవనాల మరమ్మతులకు సంబంధించి అంచనాల వివరాలను తమకు పంపించాలని సూచించారు.
సారథి న్యూస్, కౌడిపల్లి: మెదక్ జిల్లా కౌడిపల్లి మండల జనరల్‌బాడీ మీటింగ్ వాడీవేడిగా సాగింది. అధికారుల తీరుపై ప్రజాప్రతినిధులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం ఎంపీపీ అజహరుద్దీన్ అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. జడ్పీటీసీ సభ్యురాలు కవితా అమర్ సింగ్, ఎంపీపీ రాజునాయక్ మాట్లాడుతూ.. మండలంలో ప్రతి డిపార్ట్మెంట్ వారు సమాచారం లేకుండా సమావేశాలు నిర్వహించుకుంటున్నారని, దీనిపై కలెక్టర్ కు ఫిర్యాదు చేస్తామన్నారు. ఉపాధి హామీ నిర్వహిస్తున్న నిర్వహిస్తున్న తీరు ప్రజలకు ఏ మాత్రం […]
సారథి న్యూస్, కర్నూలు: 2021వ సంవత్సరానికి గాను జాతీయ స్థాయిలో అందిస్తున్న ‘బాలశక్తి, బాలకళ్యాణ్ పురస్కార్’ అవార్డులు పొందేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని కర్నూలు జిల్లా స్త్రీ శిశు అభివృద్ధి సంస్థ పథక సంచాలకులు(ఐసీడీఎస్) శారద భాగ్యరేఖ తెలిపారు. వివిధ రంగాల్లో విశేష ప్రతిభచూపిన బాలలకు ‘బాలశక్తి పురస్కార్’ అవార్డు, బాలలపై పనిచేసే స్వచ్ఛంద సంస్థలు, వ్యక్తులకు ‘బాల కళ్యాణ్ పురస్కార్’ ఇవ్వనున్నట్లు తెలిపారు. జాతీయస్థాయిలో ఎంపికైన వారికి రిపబ్లిక్‌డే సందర్భంగా రాష్ట్రపతి, ప్రధానమంత్రి ద్వారా అవార్డుతో పాటు […]
సారథి న్యూస్, కర్నూలు: బాలింతలు, గర్భిణులకు ఆరోగ్య భరోసా కల్పిస్తూ రాష్ట్రప్రభుత్వం సెప్టెంబర్ 7 నుంచి ప్రతిష్టాత్మకంగా అమలు చేయనున్న వైఎస్సార్ సంపూర్ణ పోషణ పథకం అమలుకు ఏర్పాట్లు చేశామని ఐసీడీఎస్ పీడీ శారద భాగ్యరేఖ తెలిపారు. పథకాన్ని సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా క్యాంపు ఆఫీసు నుంచి ప్రారంభిస్తారని తెలిపారు. జిల్లాలోని రైతు భరోసా కేంద్రాల్లో వెబ్ టెలికాస్ట్‌ను ప్రజాప్రతినిధులు, ఐసీడీఎస్ సిబ్బంది, లబ్ధిదారులతో కలిసి కార్యక్రమాన్ని వీక్షించేలా ఏర్పాటుచేస్తామన్నారు. ఐసీడీఎస్ […]
సారథి న్యూస్, షాద్‌నగర్: ఆ చిన్నారులకు జన్మనిచ్చిన తల్లి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయింది.. చిన్నారుల ఆలనాపాలనా తండ్రికి భారంగా మారింది.. ముక్కుపచ్చలారని ఆ పసిబిడ్డలను లాలించలేనని శిశువిహార్‌కు అప్పగించాడు. కన్నపేగు కలతచెంది బిడ్డలను వెతుక్కుంటూ వెళ్లింది. ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలం దీపాయిగూడ గ్రామానికి చెందిన గణేశ్ 16ఏళ్ల క్రితం షాద్ నగర్ కు బతుకుదెరువు కోసం వలస వచ్చాడు. పట్టణంలో కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ నేపథ్యంలో రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం […]
సారథి న్యూస్, నర్సాపూర్: కరోనా నేపథ్యంలో లాక్ డౌన్ కారణంగా గర్భిణులు, బాలింతలు ఇబ్బందులు పడకూడదని ప్రభుత్వం అంగన్ వాడీ కేంద్రాల ద్వారా ఇంటింటికీ టీహెచ్ఆర్ (టేక్ హోమ్ రేషన్) పంపిణీ చేస్తుందని సర్పంచ్ ల ఫోరం మండల అధ్యక్షుడు వెంకటేశ్వర్ రెడ్డి తెలిపారు. శనివారం మెదక్ జిల్లా కౌడిపల్లి లోని నాలుగో అంగన్ వాడీ కేంద్రం ఆధ్వర్యంలో గర్భిణులు, బాలింతలు, పిల్లలకు బియ్యం, కోడిగుడ్లు, నూనె, బాలామృతం పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ శ్రీనివాస్ […]