న్యూఢిల్లీ: మనదేశంలో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తున్నది. గత 24 గంటల్లో 48,661 కొత్తకేసులు నమోదయ్యాయి. కాగా శనివారం ఒక్కరోజే దేశవ్యాప్తంగా 4,42,263 మందికి కరోనా పరీక్షలు నిర్వహించినట్టు కేంద్ర వైద్యఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. ఇప్పటి వరకు కోటి 62 లక్షల పైచిలుకు పరీక్షలు చేశారు. మొత్తం కేసుల సంఖ్య 13,85,522 కు చేరుకున్నది. 32 వేల మంది మృతిచెందారు. 9 లక్షల మంది కరోనా నుంచి కోలుకున్నారు. 4,67,882 యాక్టివ్ కేసులున్నాయి.