సారథి న్యూస్, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా భారీవర్షాలు కురుస్తున్నందున వరదల నేపథ్యంలో అధికార యంత్రాంగం పూర్తిస్థాయిలో అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్, డీజీపీ ఎం.మహేందర్‌రెడ్డి, మంత్రులతో శనివారం మాట్లాడారు. ఆయా జిల్లాల పరిస్థితిని సమీక్షించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా భారీవర్షాలు కురుస్తుండడంతో చాలా చెరువులు అలుగుపోస్తున్నాయని, కాల్వలు పొంగి ప్రవహిస్తున్నాయని, చాలాచోట్ల రోడ్లపైకి నీరు వచ్చి చేరిందన్నారు. హైదరాబాద్ లో రెండు కంట్రోల్ రూమ్ లను […]
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో వచ్చే 24 గంటల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. వచ్చే మూడు రోజుల పాటు వాతావరణం ఇలాగే ఉంటుందని అంచనా వేస్తున్నారు. సోమవారం అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి భారీవర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు. బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా ఇప్పటికే పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. అల్పపీడనం పశ్చిమ బెంగాల్ ప్రాంతాల మీదుగా విస్తరించి ఉంది. దీని ప్రభావంతో మోస్తరు నుంచి భారీ […]