సారథి న్యూస్, ములుగు: జిల్లాలో మార్చి1వ తేదీ(సోమవారం) నుంచి రెండవ విడత కరోనా వాక్సినేషన్ ప్రారంభమవుతుందని ములుగు జిల్లా కలెక్టర్ కృష్ణఆదిత్య తెలిపారు. ఆదివారం ఆయన సంబంధిత అధికారులు, వైద్యులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. 60 ఏళ్లు పైబడిన వారికి వ్యాక్సినేషన్వేసేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారు వైద్యుల ధ్రువీకరణ పత్రాలను తీసుకురావాలని కోరారు. ఆన్లైన్లో తమ పేరును cowin. gov. in వెబ్సైట్లో నమోదు చేసుకోవాలని సూచించారు. జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి శ్యాంసుందర్, డీఎంహెచ్‌వో, […]
హైదరాబాద్: పొరుగు రాష్ట్రాల్లో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ వైద్యారోగ్యశాఖను సీఎం కె.చంద్రశేఖర్‌రావు అలర్ట్ చేశారు. ఈ మేరకు వైద్యశాఖమంత్రి ఈటల రాజేందర్, ఇతర అధికారులతో సమీక్షించారు. ముఖ్యంగా మహారాష్ట్ర, కర్ణాటక, ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో ఉన్న జిల్లాలపై ప్రత్యేకదృష్టి సారించాలని సీఎం ఆదేశించారు. కేసులు పెరగకుండా కట్టడికి చర్యలు తీసుకోవాలని సూచించారు. రాష్ట్రంలో మరిన్ని కరోనా పరీక్షలు చేయాలని, అలాగే హోం ఐసోలేషన్ కిట్లు అందజేయాలని కోరారు. ప్రస్తుతానికి తెలంగాణలో కేసులు భారీగా పెరిగిన దాఖలాలు […]
సారథి న్యూస్, మానవపాడు: మండలంలో నిర్వహించిన పల్స్‌పోలియో కార్యక్రమం విజయవంతమైందని జిల్లా పోగ్రాం అధికారి డాక్టర్ సౌజన్య అన్నారు. మానవపాడు మండలంలో 4,892 మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేశామని వివరించారు. మండలం పరిధిలో 33 పోల్స్ పోలియో బూత్‌లను ఏర్పాటు చేయడంతో పాటు ఒక మొబైల్ టీమ్ ద్వారా పోలియో చుక్కలను వేశామన్నారు. రెండురోజుల పాటు ఇంటింటికీ తిరిగి చుక్కల మందు వేస్తామని తెలిపారు. కార్యక్రమంలో హెల్త్ అధికారులు చంద్రన్న సత్యనారాయణ, సంధ్యారాణి, తిరుమల్, ఆరోగ్యశ్రీ […]
సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణలో ఆదివారం(24 గంటల్లో) కొత్తగా 2,216 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. ఇప్పటివరకు రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 1,57,096కు చేరింది. మహమ్మారి బారినపడి ఒకేరోజు 11 మంది మృతిచెందారు. రాష్ట్రంలో ఇప్పటివరకు మొత్తం మృతుల సంఖ్య 961కు చేరింది. కరోనా నుంచి కోలుకుని 2,603 మంది డిశ్చార్జ్ అయ్యారు. కరోనా నుంచి కోలుకున్న వారి మొత్తం సంఖ్య 1,24,528కు చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 31,607 యాక్టివ్ కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు […]