సారథి న్యూస్, హైదరాబాద్: సెప్టెంబర్7 నుంచి అసెంబ్లీ సమావేశాలను నిర్వహించాలని సీఎం కె.చంద్రశేఖర్‌రావు నిర్ణయించిన నేపథ్యంలో ఏర్పాట్లను మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, శాసనసభ కార్యదర్శి వి.నరసింహాచార్యులుతో కలిసి గురువారం పరిశీలించారు. అసెంబ్లీ, శాసనమండలిలో భౌతికదూరం పాటించే విధంగా సభ్యులకు సీట్లు ఏర్పాటు చేయాలని సూచించారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో అన్ని జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను […]