సారథి, రామడుగు: ప్రగతి విద్యాసంస్థల అధినేత మండవ నాగేశ్వరరావు కరోనాతో మంగళవారం సాయంత్రం గుంటూరు జిల్లా నరసరావుపేట ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. నాగేశ్వర్ రావు స్వస్థలం గుంటూరు జిల్లా నరసరావుపేట. ఆయన 40 ఏళ్ల క్రితం రామడుగు మండలం గోపాల్ రావు పేటలో చైతన్య పాఠశాలలో సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడిగా పనిచేశారు. అనంతరం మరో ఉపాధ్యాయుడు రాధాకృష్ణ, గోపాల్ రావు పేట గ్రామానికి చెందిన కర్ర శ్యాంసుందర్ రెడ్డి తో కలిసి ప్రగతి విద్యాలయాన్ని […]
తెలుగు సినీ పరిశ్రమలో తీరని విషాదం. ప్రతినాయకుడిగా, కమెడియన్‌గా, తండ్రిగా, మామగా, తాతగా.. ఇలా విభిన్న పాత్రలు పోషించి.. మెప్పించి తెలుగు సినీపరిశ్రమలో ఆకాశమంత ఎత్తుకు ఎదిగిన ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్ జయప్రకాష్ రెడ్డి కన్నుమూశాడు. మంళవారం ఉదయం 7 గంటలకు గుంటూరులోని తన నివాసంలో తుదిశ్వాస విడిచాడు. బాత్రూమ్లో గుండెపోటుతో కుప్పకూలిపోయాడు. వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే ప్రాణాలు వదిలాడు. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ మండలంలోని శిరువెళ్ల గ్రామంలోని వ్యవసాయ కుటుంబంలో జన్మించాడు. జయప్రకాష్‌రెడ్డి తండ్రి […]
అప్పులబాధ భరించలేక ఓ సీరియల్ నటి, గాయని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఏపీలోని గుంటూరుకు చెందిన రేఖ నటనపై ఆసక్తితో హైదరాబాద్ కు వచ్చి కొంతకాలం టీవీ సీరియల్స్ నటించింది. తర్వాత అవకాశాలు తగ్గడంతో గుంటూరుకు వెళ్లింది. అక్కడ అహ్మద్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకున్నారు. కుమార్తె పుట్టిన తర్వాత మనస్పర్థలు రావడంతో భర్తతో విడిపోయారు. అనంతరం చైతన్య అనే రియల్ఎస్టేట్ వ్యాపారిని వివాహం చేసుకున్నారు. గుంటూర్ విద్యానగర్‌లో ఉంటున్న రేఖ పెళ్లి వేడుకల్లో పాటలు పాడటం, యాంకరింగ్ […]