సారథి న్యూస్, రామడుగు: సర్వస్వం కోల్పోయిన ఓ గల్ఫ్ బాధితుడికి దుబాయ్ ఎల్లాల శ్రీనన్న సేవాసమితి అండగా నిలబడింది. ఆదిలాబాద్ జిల్లా, సారంగాపూర్ మండలం, చించోలికి చెందిన అంధకూర్ లింగయ్య కొంతకాలం క్రితం ఓ ఏజెంట్ సాయంతో దుబాయ్ వెళ్లాడు. కానీ అతడికి అక్కడ పనిదొరకలేదు. దీంతో ట్రక్కుల మధ్యలో పడుకుంటూ.. యాచకుడిగా జీవనం సాగిస్తున్నాడు. విషయం తెలుసుకున్న దుబాయ్ ఎల్లాల శ్రీనన్న సేవాసమితి సమన్వయకర్త గణేశ్, సామాజికవేత్త జైతా నారాయణ లింగయ్య అతడికి ఉండటానికి వసతి […]
సారథి న్యూస్, రామడుగు: కరోనా నేపథ్యంలో గల్ఫ్ దేశాల్లో ఉద్యోగాలు కోల్పోయిన తెలంగాణ కార్మికులకు విమాన్ చార్జీలు చెల్లించాలని దుబాయ్ ఎల్లాల శ్రీనన్న సేవాసమితి జేఏసీ, రామడుగు మండలం రంగశాయిపల్లి గ్రామానికి చెందిన మీడియా కోఆర్డినేటర్ చిలుముల రమేష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం దుబాయ్‌లోని .జెబెల్ అలీ క్యాంపులో ఉచిత క్వారంటైన్ సౌకర్యం కల్పించినట్లు తెలిపారు.