Breaking News

GREEN CHALLENGE

‘బాహుబలి’ గొప్ప మనసు

‘బాహుబలి’ గొప్ప మనసు

సారథి న్యూస్, జిన్నారం: గ్రీన్‌ చాలెంజ్‌లో భాగంగా సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం ఖాజీపల్లి అటవీ ప్రాంతాన్ని ప్రముఖ హీరో, యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ దత్తత తీసుకున్నారు. దుండిగల్‌ సమీపంలోని ఖాజీపేట అర్బన్‌ ఫారెస్ట్‌ బ్లాక్‌ను అటవీ శాఖమంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి, ఎంపీ సంతోష్‌ కుమార్‌తో కలిసి సోమవారం పరిశీలించారు. అర్బన్‌ ఫారెస్ట్‌ పార్కుకు శంకుస్థాపన చేసిన బాహుబలి మొక్కలు నాటారు. అలాగే ఔటర్‌ రింగ్‌ రోడ్డు వెంట అందుబాటులోకి రానున్న మరో అర్బన్‌ ఫారెస్ట్‌ […]

Read More

గ్రీన్​చాలెంజ్​ను స్వీకరించిన కలెక్టర్​

మహబూబాబాద్: మహబూబాబాద్​ జిల్లా కలెక్టర్​ గౌతమ్ గ్రీన్​చాలెంజ్​ను స్వీకరించి కలెక్టరేట్​ వద్ద మూడు మొక్కలు నాటారు. జిల్లా అదనపు కలెక్టర్ ఎం వెంకటేశ్వర్లు, జెడ్పీ సీఈవో సన్యాసయ్య, డీఆర్డీఏ పీడీ విద్యాచందన లకు గ్రీన్ ఛాలెంజ్ విసిరారు. ఈ సందర్భంగా కలెక్టర్​ మాట్లాడుతూ.. మొక్కలు నాటడం ఓ సామాజిక బాధ్యత అని పేర్కొన్నారు. కార్యక్రమంలో కలెక్టర్ కార్యాలయ సిబ్బంది కవిత, మున్సిపల్ సిబ్బంది గురు లింగం, పర్యావరణ సూపర్​వైజర్​ దైదా వెంకన్న తదితరులు పాల్గొన్నారు.

Read More

ఉద్యమంలా గ్రీన్​ ఛాలెంజ్​

సారథిన్యూస్​, హైదరాబాద్​: ఎంపీ జోగినపల్లి సంతోష్​కుమార్​ ప్రారంభించిన ‘గ్రీన్​ ఇండియా చాలెంజ్’​ ఉద్యమంలా కొనసాగుతున్నదని కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం మేడ్చల్​ మల్కాజిగిరి జిల్లా తూముకుంట మున్సిపాలిటీ పరిధిలో ఆయన గ్రీన్​ చాలెంజ్​లో భాగంగా మొక్కలు నాటారు. అనంతరం కీసర రామలింగేశ్వర స్వామిని దర్శించుకొని పూజలు చేశారు. అక్కడి ఆలయ ప్రాంగణంలోనూ మొక్కలు నాటారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్​ వాసం వెంకటేశ్వర్లు, ఎమ్మెల్యేలు వివేకానందగౌడ్​, మాధవరం కృష్ణారావు. ఎమ్మెల్సీ నవీన్ కుమార్, టీఆర్​ఎస్​ రాష్ట్ర నాయకులు. […]

Read More