ఢిల్లీ: కరోనాతో బాధపడుతూ దవాఖానలో చేరిన ఓ బాలిక(14)ను మరో కరోనా పేషెంట్ లైంగికంగా వేధించాడు. ఈ దారుణ ఘటన ఢిల్లీలోని కోవిడ్ కేర్సెంటర్లో గురువారం వెలుగుచూసింది. ఢిల్లీకి చెందిన ఓ బాలికకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో కోవిడ్ సెంటర్లో చికిత్సపొందుతున్నది. కాగా అక్కడే చికిత్సపొందుతున్న మరో కరోనా బాధితుడు బాలికపై టాయిలెట్రూంలో లైంగికదాడికి యత్నించాడు. ఈ దృశ్యాన్ని మరో వ్యక్తి తన మొబైల్ ఫోన్లో చిత్రీకరించాడు. బాలిక కేకలు పెట్టడంతో ఇతర రోగులు అక్కడికి […]
సారథి న్యూస్, వరంగల్ రూరల్: కరీంనగర్ జిల్లా చెన్నరావుపేట మండలం పాపయ్యపేటకు చెందిన ఓ యువతి కరోనా లక్షణాలతో మృతిచెందింది. ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్న సదురు యువతిని గురువారం తల్లిదండ్రలు వరంగల్‌లోని ఎంజీఎం ఆస్పత్రిలో చేర్పించారు. ఆమె నుంచి శాంపిల్స్ సేకరించే లోపే మృతిచెందిందని వైద్యులు తెలిపారు. కాగా పాపయ్యపేటలో యువతి అంత్యక్రియల్లో పాల్గొన్నవారిని హోంక్వారంటైన్లో ఉంచారు. గ్రామస్థులంతా మాస్కులు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని అధికారులు కోరుతున్నారు.
న్యూఢిల్లీ: రోహిత్.. అమ్మాయిగా పుడితే ఎలా ఉంటుంది..? టీమిండియా స్పిన్నర్ చహల్ వచ్చిన సందేహం ఇది. అనుకున్నదే తడవుగా తనకున్న పరిజ్ఞానాన్ని ఉపయోగించి బొమ్మ కూడా తయారు చేశాడు. అమ్మాయిగా ఎడిట్ చేసిన హిట్‌మాన్ ఫొటోను ట్విట్టర్లో షేర్ చేశాడు. రోహిత్ ఒరిజినల్, ఎడిట్ ఫొటోలను పక్కపక్కన పెట్టి అభిమానులను అలరించాడు. ఇంతటితో ఆగకుండా… ‘చాలా క్యూట్‌గా కనిస్తున్నావ్.. రోహితా శరమా భయ్యా’ అని క్యాప్షన్ కూడా రాశాడు.
సారథి న్యూస్, మెదక్: సెల్ ఫోన్ చార్జింగ్ పెడుతూ కరెంట్ షాక్ కు గురై బాలికమృతి చెందింది. ఈ విషాదకర సంఘటన శనివారం సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం అక్కరం గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన కుమ్మరి బాలమణి, కిష్టయ్య కూతురు స్రవంతి(9) ఉదయం సెల్ ఫోన్ చార్జింగ్ పెడుతుండగా కరెంట్ షాక్ తగిలి ప్రాణాలు కోల్పోయింది. ఉపాధి పనులకు వెళ్లిన తల్లిదండ్రులు ఇంటికి రాగానే విగతజీవిగా పడి ఉన్న బిడ్డను చూసి కన్నీరుమున్నీరయ్యారు. స్రవంతి మృతితో […]