సారథి న్యూస్, గుంటూరు : గుంటూరు జీజీహెచ్ నుంచి కరోనా పాజిటివ్ వ్యక్తి అదృశ్యమయ్యాడు. ఈ నెల 14వ తేదీన తెనాలి ప్రభుత్వ ఆసుపత్రిలో సదరు వ్యక్తి చేరాడు. తెనాలి ఆసుపత్రిలో వైద్య సదుపాయాలు లేక 16 రాత్రి జీజీహెచ్‌కు తరలించారు. జీజీహెచ్‌కు వచ్చిన నాటి నుంచి అతడు కనిపించకుండా పోయాడు. 12 రోజుల నుంచి భర్త ఆచూకీ కోసం అతని భార్య వెంకాయమ్మ ఆసుపత్రి చుట్టూ తిరుగుతోంది. ఆసుపత్రిలో ఎన్ని వార్డులు తిరిగినా… ఎంత మందిని […]
సారథి న్యూస్, శ్రీకాకుళం: ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి(జీజీహెచ్)లో కొంత భాగాన్ని కోవిడ్ –19 ఆస్పత్రిగా సిద్ధం చేస్తున్నామని శ్రీకాకుళం కలెక్టర్ జె.నివాస్ తెలిపారు. ఆదివారం స్థానిక ఆస్పత్రిని ఆయన సందర్శించారు. ఐదొందల పడకల సామర్థ్యంతో కోవిడ్ విభాగాన్ని పటిష్టం చేస్తున్నామని వెల్లడించారు. రోజుకు రెండువేల వైద్యపరీక్షలు నిర్వహించే సామర్థ్యం ఉందన్నారు. పరీక్షలకు ముందుకు వచ్చే వారికి టోకెన్ జారీచేస్తామని తెలిపారు. కార్యక్రమంలో డీఎంహెచ్‌వో డాక్టర్ ఎం.చెంచయ్య, ప్రజారోగ్యశాఖ కార్యనిర్వాహక ఇంజనీరు పి.సుగుణాకర్‌రావు, ఏపీఎంఐడీసీ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు […]