సారథి న్యూస్, గంగాధర: నవోదయ విద్యాలయంలో సీటు సాధించిన ఓ విద్యార్థిని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ అభినందించారు. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం సర్వారెడ్డి పల్లె సర్పంచ్ చిలుమల రమేశ్ కూతురు రష్మిక నవోదయ పాఠశాలలో సీటు సాధించింది. ఎమ్మెల్యే ఆ విద్యార్థినిని అభినందించారు.