సారథి న్యూస్, గజ్వేల్: సిద్దిపేట జిల్లా ములుగు మండలం నాగిరెడ్డిపల్లి గ్రామశివారులో సగం కాలిపోయిన గుర్తుతెలియని డెడ్‌బాడీని స్థానికులు బుధవారం గుర్తించారు. నాగిరెడ్డిపల్లిలోని పెద్దచెరువు సమీపంలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహాన్ని గుర్తించినట్లు ఎస్సై రాజేంద్రప్రసాద్ తెలిపారు. గుర్తుతెలియని దుండగులు హత్యచేసి మృతదేహాన్ని కాల్చివేసినట్లు భావించి ఆ కోణంలో దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. మృతుడికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని, ఆచూకీ తెలిసిన వారు ములుగు పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. డెడ్‌బాడీని గజ్వేల్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. […]
తమకు ఎదురులేదనే ధీమాతో టీఆర్‌ఎస్ ‘ట్రబుల్ షూటర్’ దుబ్బాక బాధ్యతలు తీర్మానాల వ్యూహానికి మరింత పదును ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి సీఎం డాక్టర్ రాజశేఖరరెడ్డి హయాం నుంచి నేటి దాకా ఉపఎన్నికల పార్టీగా టీఆర్‌ఎస్ తనకంటూ ఓ ప్రత్యేకత చాటుకుంటోంది. ఆయా ఎన్నికల్లో భారీ మెజారిటీలే లక్ష్యంగా పనిచేసుకుంటూ పోవడం దానికి ఆనవాయితీ. అది పార్లమెంట్ సీటైనా, అసెంబ్లీ స్థానమైనా.. పక్కా ప్లాన్ ప్రకారం సమావేశాలు, సభలు నిర్వహించడం ద్వారా ఓటర్లను కొన్ని నెలల ముందే కలవడం, […]
సారథి న్యూస్, మెదక్: సాధారణంగా ఎక్కడైన దొంగలు దొంగతనం చేస్తారు. కానీ విచిత్రంగాఓనర్ లే వైన్స్ కు కన్నం వేసి రెడ్ హ్యాండెడ్ గా పోలీసులకు దొరికారు. ఈ సంఘటన సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం గౌరారంలో మంగళవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. గజ్వేల్ రూరల్ సీఐ కోటేశ్వరరావు కథనం ప్రకారం.. కరోనా వైరస్ నియంత్రణ కోసం ప్రభుత్వం లాక్ డౌన్ సందర్భంగా గౌరారం లోని వైన్స్ కు ఎక్సైజ్ అధికారులు సీల్ వేశారు. కొన్ని రోజులుగా దొంగతనాలు […]