సారథి, మానవపాడు: జోగుళాంబ గద్వాల జిల్లా మానవపాడు మండలంలోని జల్లాపురం స్టేజీ వద్ద నకిలీ పత్తి విత్తనాలను సంబంధిత అధికారులు శుక్రవారం పట్టుకున్నారు. అక్కడే ఉన్న మహాలక్ష్మీ హోటల్ లో 46 ప్యాకెట్ల నకిలీ పత్తి విత్తనాలను నిల్వచేసినట్లు తెలియడంతో వ్యవసాయాధికారి శ్వేత తనిఖీచేశారు. వాటిని సీజ్‌చేసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. శేఖర్ అనే వ్యక్తి ఈ హోటల్ ను అడ్డాగా చేసుకుని సీడ్స్ అమ్ముతున్నట్లు గుర్తించారు. కేసు నమోదు చేసుకొని ఎస్సై ఎం.సంతోష్ కుమార్ దర్యాప్తు […]
అట్టహాసంగా పల్లెప్రగతి ప్రారంభం అభివృద్ధికి అన్ని గ్రామాలు పోటీపడాలి జడ్పీ చైర్పర్సన్సరిత తిరుపతయ్య కలిసికట్టుగా గ్రామాల అభివృద్ధి: ఎమ్మెల్యే డాక్టర్ అబ్రహం సారథి, మానవపాడు: మన ఊరు మనందరి బాధ్యత అనుకుని ప్రతిఒక్కరూ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని జోగుళాంబ గద్వాల జిల్లా జడ్పీ చైర్ పర్సన్ సరిత తిరుపతయ్య అన్నారు. గురువారం మానవపాడు మండలం కలుకుంట్ల గ్రామంలో నాలుగోవ విడత పల్లెప్రగతి కార్యక్రమాన్ని స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ వీఎం అబ్రహంతో కలిసి ఆమె ప్రారంభించారు. రైతు వేదిక […]
ఫొటోలకు ఫోజులు వద్దు.. పనులు చేయండి ప్రజలను భాగస్వాములు చేయండి జడ్పీ చైర్పర్సన్ సరిత తిరుపతయ్య సారథి, మానవపాడు: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలుచేస్తున్న 4వ విడత పల్లెప్రగతి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జోగుళాంబ గద్వాల జిల్లా జడ్పీ చైర్పర్సన్ సరితా తిరుపతయ్య కోరారు. బుధవారం మానవపాడు ఎంపీడీవో సమావేశ మందిరంలో ఎంపీపీ కోట్ల అశోక్ రెడ్డి అధ్యక్షతన ఆయా గ్రామాల సర్పంచ్‌లు, పంచాయతీ కార్యదర్శులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా జడ్పీ చైర్పర్సన్, జిల్లా అదనపు కలెక్టర్ […]
సారథి, వడ్డేపల్లి(మానవపాడు): సీఎం కేసీఆర్ దళితుల పక్షపాతి అని జోగుళాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లి మున్సిపల్ చైర్మన్ కరుణసూరి, ఎంపీపీ రజిత రాజు, జడ్పీటీసీ కాశపోగు రాజు కొనియాడారు. పేదల కోసం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నారని అన్నారు. బుధవారం ఆయన చిత్రపటానికి వడ్డేపల్లి మండల కేంద్రంలో క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. దళితుల ఎంపర్ మెంట్ స్కీం ద్వారా రూ.1000కోట్లను ప్రవేశపెట్టనున్నామని తెలిపారు. ఒక్కో పేద దళిత కుటుంబానికి రూ.10లక్షల చొప్పున […]
సారథి, మానవపాడు: పుష్కరాల సమయంలో సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలో భాగంగా అలంపూర్ నియోజకవర్గానికి వంద పడకల ఆస్పత్రిని మంజూరుచేస్తే స్థానిక నాయకులు కొందరు రచ్చరచ్చ చేసి ప్రజలకు ఉపయోగకరంగా ఉండే చోటును కాదని అడ్డుపడుతున్నారని, ఇది మంచి పద్ధతి కాదని సర్పంచ్ ల సంఘం అధ్యక్షుడు ఆత్మలింగారెడ్డి ఆక్షేపించారు. గురువారం జోగుళాంబ గద్వాల జిల్లా మానవపాడు మండల కేంద్రంలోని అతిథిగృహంలో ఆయా గ్రామాల సర్పంచ్‌లతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. నియోజకవర్గంలోని ఏడు మండలాలకు సెంటర్ పాయింట్ […]
సారథి, అలంపూర్: జోగుళాంబ గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గంలోని ఏపీ, తెలంగాణ బోర్డర్ పుల్లూరు టోల్ ప్లాజా వద్ద రాకపోకలను ఏఐసీసీ సెక్రటరీ, మాజీ ఎమ్మెల్యే ఎస్ఏ సంపత్ కుమార్ బుధవారం పరిశీలించారు. అలంపూర్ ప్రాంతానికి కర్నూలు పట్టణం చేరువలో ఉండటంతో ప్రతి చిన్న పనికి అక్కడికి వెళ్లి రావాల్సి వస్తోంది. ఈ క్రమంలో తెలంగాణ పోలీసులు వారిని అడ్డుకుంటున్నారు. ఈ విషయమై అలంపూర్ మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ అక్కడికి వచ్చి పరిస్థితులను సమీక్షించి జోగుళాంబ […]
సారథి, మానవపాడు(గద్వాల): జోగుళాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో రాష్ట్రప్రభుత్వం నూతనంగా ఏర్పాటుచేసిన తెలంగాణ డయాగ్నోస్టిక్ సెంటర్ ను వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, ఎంపీ రాములు బుధవారం ప్రారంభించారు. పేదలకు ఎలాంటి అనారోగ్య సమస్యలు తలెత్తినా ప్రభుత్వ ఆస్పత్రులకు రావాలని కోరారు. సర్కారు దవాఖానల్లో అన్నిరకాల వైద్యసేవలు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. కరోనాకు మెరుగైన వైద్యచికిత్సలు అందిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో కలెక్టర్ శృతిఓఝా, ఎస్పీ రంజన్ రతన్ కుమార్, డీఎంహెచ్ వో […]
ఎమ్మెల్యే అబ్రహం భరోసా కల్లుతాగి మృతిచెందిన కుటుంబాలకు పరామర్శ సారథి, మానవపాడు: కల్తీ కల్లు తాగి చనిపోయిన మృతుల కుటుంబాలను ఎమ్మెల్యే డాక్టర్ అబ్రహం ఆదివారం మానవపాడు మండలం జల్లాపురం గ్రామానికి చేరుకుని పరామర్శించారు. నాయక వెంకటరాముడు కుటుంబానికి రైతుబీమా పథకం ద్వారా రూ.ఐదు లక్షలు ప్రభుత్వం నుంచి త్వరగా వచ్చే విధంగా చేయాలని వ్యవసాయ అధికారులతో మాట్లాడి ఆ కుటుంబానికి భరోసా కల్పించారు. వెంకన్నకు టీఆర్ఎస్ పార్టీ సాధారణ సభ్యత్వం ఉందని, పార్టీ నుంచి సహకారం […]