సారథి న్యూస్, కర్నూలు: కరోనాపై యుద్ధంలో ఫ్రంట్‌లైన్ వారియర్స్‌గా ఉంటూ కరోనాతో మృతిచెందిన పోలీసు కుటుంబాలకు అండగా ఉంటామని కర్నూలు ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప అన్నారు. కరోనా బారినపడి మృతిచెందిన పోలీస్ హెడ్‌కానిస్టేబుల్ ఎస్ఏ మాలిక్‌బాషా కుటుంబసభ్యులకు 1993 బ్యాచ్ పోలీసులు సేకరించిన రూ.లక్ష సహాయాన్ని గురువారం అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. బాధిత పోలీసు కుటుంబాలకు ప్రభుత్వం, పోలీసుశాఖ నుంచి వచ్చే బెనిఫిట్స్ త్వరితగతిన అందించేలా చర్యలు తీసుకుంటామన్నారు.