సామాజిక సారథి, వైరా: సచివాలయాలు, దేవాలయాలకు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్న సీఎం కేసీఆర్ పేద విద్యార్థులకు బాకీ పడ్డ బోధనా రుసుము ఉపకార వేతనాల చెల్లింపుకు సంవత్సరాలుగా నిధులు ఎందుకు విడుదల చేయడం లేదని పీడీఎస్యూ అధ్యక్షుడు ఎం.అజాద్ ప్రశ్నించారు. ఖమ్మం జిల్లా వైరాలో శుక్రవారం పీడీఎస్ యూ ఆధ్వర్యంలో విద్యార్థులతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించి ఆందోళన చేశారు. ఈ సందర్భంగా ఆజాద్ మాట్లాడుతూ కొవిడ్ […]