సామాజికసారథి, హైదరాబాద్: తెలంగాణలో ఇంటర్ ఫస్ట్, సెకండ్ ఇయర్‌కు సంబంధించిన పరీక్షల ఫీజుల చెల్లింపు తేదీలను ఇంటర్ మీడియట్బోర్డు ఖరారు చేసింది. బుధవారం నుంచి ఈ నెల 24 వరకు చెల్లించవచ్చని తెలిపింది. నిర్ణీత సమయంలో ఫీజు చెల్లించనివారు.. లేటు ఫీజుతో ఫిబ్రవరి 21వ తేదీ వరకు చెల్లించవచ్చని బోర్డు కార్యదర్శి జలీల్ ప్రకటించారు. లేటు ఫీజు రూ.100తో ఈనెల 25 నుంచి 31వ తేదీ వరకు, రూ.500 ఆలస్య రుసుముతో ఫిబ్రవరి 1 నుంచి 7 […]
సారథిన్యూస్, రామడుగు: రోడ్డు ప్రమాదం అతడి జీవితాన్ని అతలాకుతలం చేసింది. తనను నమ్ముకున్న భార్యా, బిడ్డలను రోడ్డున పడేసింది. పనిచేసుకుంటే గానీ పూటగడవని ఆ కుటుంబానికి ఇప్పడు పెద్దకష్టమే వచ్చి పడింది. దాతలు ముందుకొచ్చి తమను ఆదుకోవాలని ప్రస్తుతం ఆ కుటుంబం దీనంగా వేడకుంటున్నది. కరీంనగర్ జిల్లా రామడుగుకు చెందిన రాజశేఖర్ మూడు నెలల క్రితం రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. అప్పటినుంచి అతడు మంచానికే పరిమితమయ్యాడు. అతడికి మెదడులో రక్తం గడ్డకట్టిందని.. ఆపరేషన్ చేసేందుకు రూ. […]