సారథి న్యూస్, ఎమ్మిగనూరు: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కరోనా వైరస్ ను కట్టడి చేయడంలో పూర్తిగా విఫలమైందని ఎమ్మిగనూరు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ బీవీ జయనాగేశ్వరరెడ్డి మండిపడ్డారు. దేశంలో అత్యధిక కరోనా కేసులు నమోదైన రాష్ట్రాల జాబితాలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 3వ స్థానంలో ఉందని గుర్తుచేశారు. బుధవారం ఆయన తన నివాసంలో విలేకరులతో మాట్లాడారు. జాతీయస్థాయిలో కరోనా కేసుల రికవరీ రేటు శాతం దాదాపు 69.29% ఉండగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 10% తక్కువగా 60.8% నమోదవుతుందన్నారు. కరోనా క్వారంటైన్ […]
సారథి న్యూస్, ఎమ్మిగనూరు: కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలో వైఎస్సార్ చేయూత పథకాన్ని ఎమ్మెల్యే ఎర్రకోట చెన్నకేశవరెడ్డి బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 45 ఏళ్లు దాటిన ఎస్సీ, ఎస్టీ, బీసి, మైనారిటీ అక్కాచెల్లెళ్లకు దశలవారీగా రూ.75వేలు ఉచితంగా అందజేస్తున్నామని తెలిపారు. కార్పొరేషన్లను ప్రక్షాళన చేసి వారి ఆర్థిక ప్రగతికి బాటలు వేస్తామన్నారు. మహిళలకు మొదటి విడత కింద ఒక్కొక్కరికీ రూ.18,750 చొప్పున మొత్తం 9,949 మంది లబ్ధిదారులకు రూ.18.65కోట్ల మెగా చెక్కును లబ్ధిదారులకు […]