సారథిన్యూస్, రామడుగు: కురుమ యువ చైతన్యసమితి జిల్లా కమిటీని ఆదివారం ఎన్నుకొన్నారు. రాష్ట్ర అధ్యక్షుడిగా చిర్ర చందు, ఉపాధ్యక్షుడిగా గోరికే నరసింహ, జిల్లా అధ్యక్షుడిగా చిమ్మల్ల మహేశ్, రామడుగుమండలం ప్రధాన కార్యదర్శి గా పెద్ది వీరేశం చొప్పదండి మండలం ఉపాధ్యక్షులుగా బాగోతం అజయ్, జాతరకొండ మహేశ్, రాజన్నల తిరుపతి, ఒగ్గరి శ్రీనివాస్ కోశాధికారిగా ఎల్లమ్మల కృష్ణమరాజ్ తదితరులు ఎన్నికయ్యారు.
సారథిన్యూస్, రామడుగు: సమాచార హక్కు చట్టం రామడుగు మండల అధ్యక్షుడిగా అనుపురం పరుశరాంను నియమిస్తున్నట్టు జిల్లా ప్రధాన కార్యదర్శి సంపత్ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మండల, గ్రామ స్థాయి లో సమాచార హక్కు రక్షణ చట్టంపై అవగాహన కల్పిస్తామన్నారు. పరుశురాంను జిల్లా అధ్యక్షుడు కోలిపాక శేఖర్, చొప్పదండి నియోజకవర్గ ఇన్చార్జ్ వేణుగోపాల్ గౌడ్ అభినందించారు.
సారథిన్యూస్, రామడుగు: తెలంగాణ సైకాలజిస్ట్ అసోసియేషన్ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడిగా రామడుగు మండలం గోపాల్రావుపేటకు చెందిన సీనియర్ పాత్రికేయులు ఎజ్రా మల్లేశం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షురాలిగా రేష్మ, ప్రధాన కార్యదర్శిగా ఐలయ్య, సంయుక్త కార్యదర్శిగా అశోక్, సభ్యులుగా సదానందం, కుమార స్వామి తదితరులు ఎన్నికయ్యారు.