లక్నో: ఉత్తర్‌ప్రదేశ్‌లో ఓ రౌడీ ముఠా రెచ్చిపోయింది. అరెస్ట్ చేసేందుకు వచ్చిన ఎనిమిది మంది పోలీసులను రౌడీలు కాల్చిచంపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. యూపీలోని కాన్పూర్‌కు చెందిన రౌడీ షీటర్ వికాస్ దూబే పలు కేసుల్లో నిందితుడు. అతడిని అరెస్ట్ చేసేందుకు పోలీసులు శుక్రవారం తెల్లవారుజామున కాన్పూర్ సమీపంలో అతడు నివాసం ఉంటున్న డిక్రూ గ్రామానికి వెళ్లారు. వికాస్ ఇంటి సమీపంలోని ఓ ఇంటిమీద కాపుకాసిన రౌడీలు పోలీస్ బృందంపై విక్షణారహితంగా బుల్లెట్ల వర్షం కురిపించారు. […]
సారథి న్యూస్, కర్నూలు: ‘కరోనా వైరస్ నాకు రాదని, నేను ఆరోగ్యంగా బలంగా ఉన్నానని, పొరపాటున కూడా అనుకోవద్దని’ ట్రాఫిక్ డీఎస్పీ మహబూబ్‌బాషా ప్రజలకు వినూత్నరీతిలో అవగాహన కల్పించారు. శుక్రవారం నగరంలోని రాజ్ విహార్, ఆర్‌ఎస్ రోడ్డు, బస్టాండ్ ప్రాంతాల్లో రాకపోకలు సాగించే ప్రయాణికులు, ప్రజలకు కరోనా వైరస్ పై అవగాహన కల్పించారు. ప్రతిఒక్కరూ మాస్క్ కట్టుకోవాలని, భౌతిక దూరం పాటించాలని, అవసరమైతేనే బయటికి రావాలని సూచించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ మీటర్దూరం పాటించాలని ఆదేశించారు. నగరంలో మాస్క్ […]