Breaking News

DASARA

ఘనంగా సద్దుల బతుకమ్మ సంబరాలు

ఘనంగా సద్దుల బతుకమ్మ సంబరాలు

సారథి న్యూస్, వాజేడు: ములుగు జిల్లా వాజేడు మండల కేంద్రంలో సద్దుల బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటాయి. కరోనా కారణంగా 9 రోజులుగా సంబరాలు అంతంత మాత్రంగానే జరుపుకున్నా, చివరిరోజు ఉత్సవాలు వైభవంగా జరిగాయి. చిన్నాపెద్దా అనే తేడా లేకుండా ప్రతిఒక్కరూ వేడుకల్లో పాల్గొన్నారు. ఏ పల్లెలో చూసినా సంబరాల ఉత్సాహమే కనిపించింది. డీజే పాటలు, డోలు వాయిద్యాలతో సందడిగా కనిపించింది. మహిళలంతా బతుకమ్మను పోయిరా.. గౌరమ్మా పోయిరా.. అంటూ సాగనంపారు.

Read More
ఘనంగా సద్దుల బతుకమ్మ

ఘనంగా సద్దుల బతుకమ్మ

సారథి న్యూస్, రామాయంపేట: ‘పోయి రా బతుకమ్మ పోయి రావమ్మ’ అంటూ మెదక్ జిల్లా నిజాంపేట మండలంలోని పలు గ్రామాల్లో ఊరుఊరంతా తంగేడు వనలైనవి. ‘ఏమేమి పువ్వొప్పునే గౌరమ్మ.. గన్నేరు పువ్వొప్పునే గౌరమ్మ.. శివ శివ శివ.. ఉయ్యాల్లో.. శివుడా .. నిన్ను తలుతూ’ అడబిడ్డలు బతుకమ్మ పాటలు హోరెత్తినయ్. సద్దుల బతుకమ్మ సందర్భంగా మహిళలు ఆడిపాడారు. పల్లెపదం పాడుతూ పాదం కలిపారు. బతుకమ్మల సంబురాలు అంబరాన్నంటాయి. లయబద్ధంగా అడుగులు వేస్తూ.. పాటలతో చప్పట్లు కొడుతూ.. భూతల్లికి […]

Read More
దసరా మహోత్సవాలకు రండి

దసరా మహోత్సవాలకు రండి

సారథి న్యూస్, హైదరాబాద్​: వరంగల్ లో ఈనెల 17 నుంచి 26వ తేదీ వరకు జరిగే భద్రకాళీదేవి శరన్నవరాత్రి దసరా మహోత్సవాల పోస్టర్ ను గురువారం ప్రగతిభవన్ లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆవిష్కరించారు. ప్రతిఏటా ఎంతో వైభవోపేతంగా జరిగే ఈ ఉత్సవాలకు రావాలని సీఎం కేసీఆర్ ను కోరుతూ దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, ఆలయ ప్రధాన అర్చకులు భద్రకాళి శేషు ఆహ్వాన పత్రికను అందజేశారు. ఆలయ ఈఓ సునీత, […]

Read More
దసరా కానుకగా తీరొక్క చీరలు

దసరా కానుకగా తీరొక్క చీరలు

సారథి న్యూస్, ములుగు: పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. ప్రతి ఏడాది మంచి డిజైన్లు, నాణ్యత పరంగా మెరుగుపర్చుకుంటూ ఈ ఏడాది 287 డిజైన్లతో చీరలను తయారు చేశామన్నారు. శుక్రవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో మహబూబాబాద్ ఎంపీ మాలోతు కవితతో కలిసి బతుకమ్మ చీరలు పంపిణీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ద్వారా జిల్లాలో 85వేల మంది, రాష్ట్రంలో కోటి మందికి బతుకమ్మ చీరల పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. మేడారం అమ్మవార్లు […]

Read More