తన స్పిన్ మాయజాలంతో ప్రపంచ క్రికెట్ చరిత్రలో సుస్థిర స్థానం సంపాదించుకున్న శ్రీలంక దిగ్జజ బౌలర్ ముత్తయ్య మురళీధరన్ జీవిత చరిత్ర ఆధారంగా ఓ సినిమా తెరకెక్కుతున్నది. తమిళనటుడు విజయ్ సేతుపతి ఈ చిత్రంలో మురళీధరన్ పాత్రను పోషించబోతున్నాడు. మురళీధరన్ బౌలింగ్ శైలి చాలా భిన్నంగా ఉంటుంది. అతడి బౌలింగ్ అంటే ప్రముఖ ఆటగాళ్లు సైతం వణికిపోతుంటారు. కీలకసమయంలో వికెట్లు పడగొట్టి జట్టును గట్టెంకించడం మురళీధరన్ ప్రత్యేకత. అలాంటి గొప్ప క్రికెటర్ జీవిత కథను సినిమా రూపంలో […]
న్యూఢిల్లీ: అవసరమైనప్పుడు మ్యాచ్ స్వరూపాన్ని మార్చేసే సత్తా, సామర్థ్యం భారత జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీకి ఉన్నాయని బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్ అన్నాడు. దానికి తగినట్లుగానే విరాట్ ఆటతీరును పూర్తిగా మార్చేసుకుంటాడన్నాడు. ఏ మ్యాచ్ అయినా నిజాయితీగా ఆడటమే కోహ్లీ అతిపెద్ద బలమని చెప్పాడు. ‘కోహ్లీలో నాకు నచ్చిన అంశం ఆటపై అతనికి ఉన్న పట్టుదల, ఆసక్తి. ప్రపంచంలోనే అత్యుత్తమ ఆటగాడిగా ఉండాలనుకుంటాడు. దానికోసం ఎంతకైనా శ్రమిస్తాడు. ఇంతలా కష్టపడే క్రికెటర్‌ను నేను ఎప్పుడూ చూడలేదు. […]