Breaking News

COLLECTOR

ఊళ్లకు వెళ్లేందుకు అనుమతి

ఊళ్లకు వెళ్లేందుకు అనుమతి

సారథి న్యూస్, నాగర్​ కర్నూల్: లాక్​ డౌన్​ నేపథ్యంలో జిల్లాలో ఉండిపోయిన వలస కార్మికులు, విద్యార్థులను వారివారి స్వస్థలాలకు తరలించేందుకు నోడల్ ఆఫీసర్లుగా అఖిలేష్ రెడ్డి, అనిల్ ప్రకాష్ ను నియమించినట్లు నాగర్​ కర్నూల్​ జిల్లా కలెక్టర్ శ్రీధర్ శుక్రవారం తెలిపారు. వలస కార్మికుల కోసం అంతర్రాష్ట్ర ప్రయాణాలకు అనుమతినిస్తున్నట్లు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించాయని, అందుకు జిల్లాస్థాయిలో నోడల్ అధికారులను నియమించామని పేర్కొన్నారు. మండలాల వారీగా కలెక్టరేట్​లో వివరాలను ఆయా నోడల్ ఆఫీసర్లు సేకరించారన్నారు. జిల్లాలో […]

Read More
వలస కార్మికుల లిస్టు రెడీ చేయండి

వలస కార్మికుల లిస్టు రెడీ చేయండి

సారథి న్యూస్​, మహబూబ్​ నగర్​: కరోనా కారణంగా ఇప్పటి వరకు ఇతర ప్రాంతాల్లో చిక్కుకుపోయి జిల్లాకు వస్తున్న వలస కార్మికులపై ప్రత్యేకదృష్టి పెట్టాలని మహబూబ్​ నగర్​ జిల్లా కలెక్టర్ ఎస్.వెంకటరావు అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఆయన కలెక్టరేట్​ లో వారితో సమీక్షించారు. జిల్లా నుంచి వెళ్లేవారి లిస్టును రెడీ చేయాలని సూచించారు. బయటి ప్రాంతాల నుంచి వచ్చిన వారందరినీ హోం క్వారంటైన్​ లో ఉంచాలని, ఎవరికైనా కరోనా అనుమానిత లక్షణాలు గుర్తించినట్లయితే ప్రభుత్వ ఆస్పత్రి, ఎస్​వీఎస్​ ఆస్పత్రికి […]

Read More
ఆ మార్గం నుంచి ఇతరులను రానివ్వకండి

ఆ మార్గం నుంచి ఇతరులను రానివ్వకండి

సారథి న్యూస్, శ్రీకాకుళం: శ్రీకాకుళం ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో కోవిడ్– 19 (కరోనా)కు ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన ఐసోలేషన్ వార్డులను కలెక్టర్ జె.నివాస్ గురువారం పరిశీలించారు. కరోనా వ్యాధిగ్రస్తులు వచ్చే మార్గం గుండా ఇతర వ్యాధిగ్రస్తులు రాకపోకలు సాగించకుండా ఏర్పాట్లు చేయాలని ఆయన సూచించారు. జీజీహెచ్ లో 90 బెడ్లను ఐసోలేషన్ కు ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. ఈ వార్డుల్లో పనిచేసే వైద్యులు, సిబ్బందికి కూడా ప్రత్యేక వసతి ఉండాలని, పర్సనల్ ప్రొటెక్షన్ ఎక్విప్​ మెంట్​ సరఫరా చేయాలని […]

Read More
మందులు కొనేవారిపై ఓ కన్నేయండి

మందులు కొనేవారిపై ఓ కన్నేయండి

సారథి న్యూస్, నాగర్ కర్నూల్: దగ్గు, జ్వరం, జలుబు లక్షణాలకు మెడికల్ షాపుల్లో మందులు కొనేవారిపై దృష్టిపెట్టాలని నాగర్ కర్నూల్ కలెక్టర్ ఈ.శ్రీధర్ సూచించారు. ఈ లక్షణాలతో ప్రైవేట్ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న వారి వివరాలు సేకరించాలని ఆదేశించారు. బుధవారం ఆయన కలెక్టర్ క్యాంపు ఆఫీసులో డాక్టర్లతో సమీక్షించారు. ఫీవర్ టెస్ట్ లను పకడ్బందీగా నిర్వహించాలని సూచించారు. జిల్లాలో ఇద్దరు కరోనా పాజిటివ్ వ్యక్తులను జిల్లా ఆస్పత్రి నుంచి ఇంటికి పంపించినట్లు తెలిపారు. సమావేశంలో అదనపు కలెక్టర్ మనుచౌదరి, […]

Read More
మొక్కలు బాగున్నయ్

మొక్కలు బాగున్నయ్

సారథి న్యూస్, హైదరాబాద్: మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కీసర అటవీ ప్రాంతంలో కలెక్టర్ వి.వెంకటేశ్వర్లు, అటవీశాఖ సిబ్బందితో కలిసి మంగళవారం పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. హరితహారంలో భాగంగా గతేడాది మాస్ ప్లాంటేషన్ లో ఎంపీ సంతోష్ కుమార్ నాటిన మొక్కలు బాగున్నాయని అభిప్రాయపడ్డారు. ఖాళీగా ఉన్న ప్రదేశాల్లో వర్షాకాలంలో మొక్కలు నాటాలని అధికారులను ఆదేశించారు. ఎకో పార్క్ పార్కులో వాకింగ్ ట్రాక్, చిల్డ్రన్స్ పార్క్ ఏర్పాటు చేయాలన్నారు. కీసరలోని చెరువును సుందరీకరించి పర్యాటక […]

Read More
కరోనా పరీక్షలకు స్వచ్ఛందంగా రావాలి

కరోనా పరీక్షలకు స్వచ్ఛందంగా రావాలి

సారథి న్యూస్, శ్రీకాకుళం : దేశ, విదేశాల నుంచి జిల్లాకు వచ్చిన వారు స్వచ్ఛందంగా ముందుకొచ్చి వైద్యపరీక్షలు చేయించుకోవాలని శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ జె.నివాస్ పిలుపునిచ్చారు. మంగళవారం ‘జగనన్న విద్యా దీవెన పథకం’ ప్రారంభోత్సవం అనంతరం కలెక్టర్, కరోనాపై తీసుకుంటున్న చర్యలపై మీడియాకు వివరించారు. జిల్లాకు ఇప్పటివరకు విదేశాల నుండి 13,500 మంది వరకు వచ్చారని, వారు స్వచ్ఛందంగా సెల్ నం.94912 22122, 089422 40699 లకు ఫోన్ చేసి వివరాలు తెలియజేయాలన్నారు. ఢిల్లీ, ముంబై తదితర […]

Read More
చిన్నారులూ.. భళా

చిన్నారులూ.. భళా

సారథి న్యూస్, నాగర్ కర్నూల్: నాగర్ కర్నూల్ పట్టణానికి చెందిన చెందిన ఇద్దరు చిన్నారులు ఆదర్శంగా నిలిచారు. కరోనా మహమ్మారిపై ప్రభుత్వాలు చేస్తున్న పోరుకు తమవంతు సాయం అందించారు. తాము దాచుకున్న పాకెట్ మనీ రూ.2,009ను ‘సీఎం కేర్స్ ఫండ్‌’కు విరాళంగా ఇచ్చి తమలోని దాతృత్వ గుణాన్ని చాటుకున్నారు. పట్టణానికి చెందిన ఎల్ఐసీ ఉద్యోగి కులకర్ణి పిల్లలు దేశ్ పాండే బాలార్క్ ఐదవ తరగతి, దేశ్పాండే శ్రీహార్ష్ స్థానిక ఓ ప్రైవేట్ స్కూలులో రెండవ తరగతి చదువుతున్నాడు. […]

Read More
దూరం.. దూరం ఉండాలె

దూరం.. దూరం ఉండాలె

సారథి న్యూస్, మహబూబ్ నగర్: రైతు బజార్ లలో వినియోగదారులతో పాటు కూరగాయలు అమ్మేవారు తప్పనిసరిగా మాస్క్ లు ధరించాలని మహబూబ్ నగర్ కలెక్టర్ ఎస్.వెంకటరావు సూచించారు. మంగళవారం ఆయన మహబూబ్ నగర్ పట్టణంలో నూతనంగా ఏర్పాటుచేసిన రామయ్య బౌలి, న్యూటౌన్ రైతు బజార్ ను ఆకస్మికంగా తనిఖీచేసి క్రయవిక్రయాలను పరిశీలించారు. విక్రయదారులు, కొనుగోలుదారులతో నేరుగా మాట్లాడారు. తప్పనిసరిగా సామాజిక దూరం పాటించాలని, మాస్క్ లను కచ్చితంగా కట్టుకోవాలని సూచించారు. ఆయన వెంట అదనపు కలెక్టర్ మోహన్ […]

Read More