సారథిన్యూస్, కొత్తగూడెం: సింగరేణిలో ఎక్స్ ప్లోరేషన్ విభాగంలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులు, ప్రైవేట్ సెక్యూరిటీ గార్డులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని సీఐటీయూ నాయకులు డిమాండ్ చేశారు. సోమవారం కొత్తగూడెంలో కాంట్రాక్ట్ కార్మికులు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో నాయకులు మాట్లాడుతూ.. సింగరేణి సంస్థలోనే ప్రత్యామ్నాయ పనులలో వీరికి అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. లేకపోతే ఆందోళన నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు పీ ప్రమోద్, ఎన్ సూర్య, భద్రం, నిజాముద్దీన్, వెంకటేశ్వర్లు, చంద్రశేఖర్, సంపత్, సమ్మయ్య, […]
సారథి న్యూస్, రామాయంపేట: పెంచిన జీతాలను వెంటనే చెల్లించాలని గ్రామపంచాయతీ కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. నిజాంపేట ఎంపీడీవో కార్యాలయం ఎదుట శుక్రవారం వారు ధర్నా చేపట్టారు. జీవో 51ని అడ్డంపెట్టుకొని కార్మికులను తొలగిస్తున్నారని మండిపడ్డారు. కార్యక్రమంలో సీఐటీయూ నేత నింగోళ్ల సత్యం, కార్మికులు పాల్గొన్నారు.
గోదావరిఖని: సింగరేణి బొగ్గుగనుల వేలాన్ని వెంటనే నిలిపివేయాలని వివిధ సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ఏఐటీయూసీ, సీఐటీయూ పిలుపుమేరకు ఆర్జీ-1 లో కార్మికులు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా కేంద్రప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. అనంతరం ఏఐటీయూసీ కేంద్రకమిటీ సెక్రటరీ మెరుగు రాజయ్య మాట్లాడుతూ.. కేంద్రప్రభుత్వం ఇష్టారాజ్యంగా ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేసిందని చెప్పారు. కార్యక్రమంలో నాయకులు మడ్డి ఎల్లయ్య, వేల్పుల కుమారస్వామి, మెండే శ్రీనివాస్, ఉల్లి మొగిలి, జీ ఆనందం, పీ రవి, ఏ […]
సారథి న్యూస్, ఆదిలాబాద్ : సీఐటీయూ ఆధ్వర్యంలో కార్మిక వ్యతిరేక విధానాలపై శుక్రవారం రిమ్స్ ఆవరణలో కార్మికులు నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా కార్యదర్శి జాదవ్ రాజేందర్ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం కార్మిక చట్టాల్లో మార్పు, 12 గంటల పని దినాన్ని పెంచుతుందన్నారు. ఇలాంటి కుట్రలను తిప్పికొట్టేందుకు దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. కార్మికులందరికీ బోనస్ రూపంలో రూ.25 వేలు చెల్లించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో రిమ్స్ కాంట్రాక్ట్ అండ్ ఔట్ సోర్సింగ్ […]
సారథి న్యూస్, గోదావరిఖని: పర్స సత్యనారాయణ.. విప్లవ ఉద్యమానికి నాంది పలికారని, కార్మికవర్గం ఆయన అడుగు జాడల్లో నడవాలని పెద్దపల్లి జిల్లా సీఐటీయూ ఎర్రవెల్లి ముత్యం రావు, సింగరేణి కాలరీస్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు తుమ్మల రాజిరెడ్డి అన్నారు. శుక్రవారం సాయంత్రం పర్స సత్యనారాయణ ఐదో వర్ధంతి స్థానిక సీఐటీయూ ఆఫీసులో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సింగరేణి కార్మిక ప్రాంతంలో పరస సత్యనారాయణ చేసిన కార్మిక ఉద్యమాల వలన ఎన్నో సమస్యలు పరిష్కారమయ్యేవని […]
కార్మిక సంఘాల జేఏసీ నేతలు సారథి న్యూస్, పెద్దపెల్లి: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికుల హక్కులు, చట్టాలను కాలరాస్తున్నాయని నిరసిస్తూ.. ఏఐటీయూసీ, సీఐటీయూ ఐఎఫ్ టీయూ తదితర కార్మిక సంఘాల జేఏసీ దేశవ్యాప్త నిరసనలో భాగంగా శుక్రవారం పెద్దపల్లి కలెక్టరేట్ ఎదుట ఆందోళన నిర్వహించారు. కేంద్రప్రభుత్వం కార్మికుల చట్టాలను రద్దు చేయడం సరికాదన్నారు. కేంద్రరాష్ట్ర ప్రభుత్వాల విధానాల కారణంగా కార్మికులు ఉపాధి కోల్పోతారని, పనికి, ఉద్యోగ భద్రత లేకుండా పోతుందని ఆందోళన వ్యక్తంచేశారు. కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ […]
సారథి న్యూస్, గోదావరిఖని: పెద్దపల్లి జిల్లా సింగరేణి కాలరీస్ ఎంప్లాయీస్ యూనియన్(సీఐటీయూ), అర్జీ1 కమిటీ ఆధ్వర్యంలో గోదావరిఖని ఆఫీస్, ఏరియా వర్క్ షాప్, రమేష్ నగర్ తదితర ప్రాంతాల్లో శుక్రవారం మే డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షుడు తుమ్మల రాజారెడ్డి, కనకయ్య, మహేష్, మెండ శ్రీనివాస్, జె.గజెందర్, సానం రవి, అంజయ్య, కె రంగారావు, వంగల రాములు పాల్గొన్నారు.