సారథిన్యూస్, తలకొండపల్లి: ఆలయభూములను కొందరు అక్రమార్కులు కబ్జా చేశారంటూ రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం చుక్కాపూర్ గ్రామంలో రైతులు నిరసన తెలిపారు. గ్రామంలోని సర్వే నెంబరు 75 లోని ఉన్న ఆలయభూమిలో కొందరు రహదారిని నిర్మిస్తున్నారని ఆరోపించారు. జిల్లా కలెక్టర్. దేవాదాయశాఖ అధికారులు తగిన చొరవ తీసుకోవాలని, ఆలయ భూములు పరిరక్షించాలని రైతులు డిమాండ్ చేశారు.