సారథి న్యూస్, కర్నూలు: వచ్చే ఎన్నికల్లో మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అడ్రస్ గల్లంతు కావడం ఖాయమని వైఎస్సార్ సీపీ నగర సమన్వయకర్త మాదారపు కేదార్ నాథ్ అన్నారు. సోమవారం బాపట్ల ఎంపీ నందిగామ సురేష్, వేమూరు ఎమ్మెల్యే మెరుగు నాగార్జున పిలుపు మేరకు రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహాల వద్ద నిరసన కార్యక్రమాలు చేపట్టారు. కర్నూలు పాత బస్టాండ్ ఆవరణలో ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద ధర్నా నిర్వహించారు. […]