దుబాయ్: మరికొద్ది రోజుల్లో మొదలవనున్న ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ కు వరుస షాక్ లు తగులుతున్నాయి. ఆ జట్టు సభ్యుడు, ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ సైతం ఈ ఏడాది ఐపీఎల్ నుంచి వైదొలుగుతున్నట్టు ప్రకటించారు. ఇప్పటికే సీఎస్కే కీలక సభ్యుడు సురేష్ రైనా టోర్నీ నుంచి బయటకు రాగా.. ఇప్పుడు భజ్జీ కూడా నిష్క్రమించాడు. వ్యక్తిగత కారణాల వల్ల ఐపీఎల్ నుంచి తప్పుకుంటున్నట్టు సీఎస్కే యాజమాన్యానికి టర్భోనేటర్ వివరించాడు.
జోహెన్స్‌బర్గ్: చెన్నై సూపర్‌కింగ్స్ డ్రెస్సింగ్ రూమ్‌లో ఆలోచనాపరులు ఎక్కువ మంది ఉన్నారని దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ ఫ్యాఫ్ డు ఫ్లెసిస్ అన్నాడు. దీనివల్లే సూపర్‌కింగ్స్ ఐపీఎల్లో బాగా విజయవంతం అవుతుందన్నాడు. ‘చెన్నైతో నా అనుబంధం విడదీయలేనిది. మాది కామ్ డ్రెస్సింగ్ రూమ్. దిగ్గజ కెప్టెన్ ధోనీతో పాటు చాలా మంది ఆలోచనాపరులు ఉన్నారు. వీళ్ల అనుభవం టీమ్‌కు అదనపు బలం. ప్రతి ఒక్కరిలో ఓ నమ్మకం ఉంటుంది. అవే మాకు విజయాలను తెచ్చిపెడుతున్నాయి. ప్రతి ప్లేయర్ చాలా […]