సారథి న్యూస్, వాజేడు, వెంకటాపురం: గిరిజన విశ్వవిద్యాలయాన్ని చర్లలోనే ఏర్పాటుచేయడం ద్వారానే ఐదు రాష్ట్రాల ఆదివాసీలకు న్యాయం జరుగుతుందని ఆదివాసీ నవనిర్మాణ సేన వ్యవస్థాపక అధ్యక్షుడు కొర్శా నర్సింహామూర్తి,రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వాసం.నాగరాజు అభిప్రాయపడ్డారు. మైదాన ప్రాంతమైన ములుగులో ఏర్పాటుచేయడం సరికాదన్నారు. శనివారం వారు చర్లలో విలేకరులతో మాట్లాడారు. చర్లలో ఏర్పాటుచేస్తే ఛత్తీస్ ఘడ్, ఒడిశా, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ఆదివాసీలకు అత్యంత అనువుగా ఉంటుందన్నారు. అంతేకాకుండా స్థానిక యువతకు ఉపాధి దొరుకుతుందన్నారు. ఆదివాసీలను ఉన్నతవిద్యకు […]
సారథి న్యూస్, ములుగు: ములుగు జిల్లా వెంకటాపురం మండలం ఆలుబాకలో శనివారం మావోయిస్టు మిలిషియా సభ్యుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. వెంకటాపురం మండలం తిప్పాపురం గ్రామానికి చెందిన మిడియం చిన్నలక్ష్మయ్య అనుమానాస్పదంగా తిరుగుతుండగా పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం చెప్పాడు. మూడేళ్లుగా మిలిషియా సభ్యుడిగా పనిచేస్తూ, ప్రభుత్వ నిషేధిత సీపీఐ మావోయిస్ట్ పార్టీకి నిత్యావసర వస్తువులు అందజేస్తూ.. వారు గ్రామానికి వచ్చినప్పుడల్లా వారికి భోజన వసతి ఏర్పాటు చేస్తూ.. పోలీస్ వారి కదలికలను ఎప్పటికప్పుడు […]
భద్రాచలం: గోదావరి నది మహోగ్రరూపం దాల్చింది. భద్రాచలం వద్ద గంట గంటకూ ప్రవాహ ఉధృతి పెరుగుతోంది. ఇప్పటికే చివరిదైన మూడవ ప్రమాద హెచ్చరికను జారీచేశారు. ప్రస్తుతం నీటి ప్రవాహం భద్రాచలం వద్ద 60 అడుగులకు చేరింది. ఇంకా ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద వస్తుండడంతో నీటిమట్టం పెరిగే అవకాశం ఉందని కేంద్ర జలసంఘం హెచ్చరించింది. 2014 తర్వాత ఈ స్థాయిలో వరద రావడంతో ఇదే మొదటిసారి అని అధికారులు వెల్లడించారు. 2014, సెప్టెంబర్ 8న భద్రాచలం […]
సారథి న్యూస్, కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని చర్ల మండలం కుర్నపల్లి గ్రామానికి చెందిన ఆరుగురు నిషేధిత మావోయిస్ట్ పార్టీ కమిటీ సభ్యులను ఆదివారం గ్రామస్తులు స్వచ్ఛందంగా పోలీసుల ఎదుట సరెండర్ చేయించారు. వారిలో కోరం నాగేశ్వర్రావు, కొమరం రమేష్ , సొందే రమేష్, కోరం సత్యం, ఇర్పా వెంకటేశ్వర్లు, వాగే కన్నారావు ఉన్నారు. ఇకపై మావోయిస్టులకు సహకరించేది లేదని గ్రామస్తులంతా స్వచ్ఛందంగా తీర్మానం చేశారు.