సారథిన్యూస్, గద్వాల: జోగులాంబ గద్వాల జిల్లా మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్‌గా రామేశ్వరమ్మ ఎంపికయ్యారు. ఈ మేరకు మంగళవారం రామేశ్వరమ్మకు రాష్ట్ర ప్రభుత్వం నియామక ఉత్తర్వులు అందజేసింది. ఈ సందర్భంగా ఆమెను ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి అభినందించారు. రామేశ్వరమ్మ నేతృత్వంలో మార్కెట్‌కమిటీ మరింత అభివృద్ధి చెందుతుందని ఆయన ఆకాంక్షించారు. కాగా తనపై నమ్మకం ఉంచి పదవి కట్టబెట్టినందుకు రాష్ట్ర మంత్రులు కేటీఆర్, సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డికి రామేశ్వరమ్మ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.