Breaking News

CARONA

జిల్లాలకు విస్తరిస్తున్న కరోనా

సారథిన్యూస్​, సిద్దిపేట/ఖమ్మం: హైదరాబాద్​కే పరిమితమైందనుకున్న కరోనా క్రమంగా జిల్లాలకూ విస్తరిస్తున్నది. సిద్దిపేట జిల్లా కోహెడ మండలం తంగళ్లపల్లిలో ఇద్దరికి కరోనా పాజిటివ్​ అని తేలింది. ప్రస్తుతం అందులో ఒకరు పరారీలో ఉన్నాడు. మరొకరు హైదరాబాద్ గాంధీ దవాఖానలో చికిత్సపొందుతున్నట్టు సమాచారం. వారిద్దరూ హైదరాబాద్​లోని ఓ మార్కెట్లో పనిచేస్తున్నారని తెలిసింది. మరోవైపు ఖమ్మం జిల్లా తల్లాడ పట్టణంలో కరోనా పాజిటివ్​ కేసు నమోదైంది. దీంతో అధికారులు పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపడుతున్నారు. తహసీల్దార్​ గంటా శ్రీలత, ఎంపీడీవో రవీంద్ర రెడ్డి, […]

Read More

వీఆర్వో కుటుంబానికి కరోనా

సారథిన్యూస్​, పెద్దపల్లి: పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ తాహసిల్దార్ కార్యాలయంలో పనిచేస్తున్న వీఆర్ఏ, అతడి కుటుంబసభ్యులు నలుగురికి కరోనా సోకింది. కాగా కొంతకాలంగా వీఆర్ఏకు కరోనా లక్షణాలు కనిపించడంతో అతడి కుటుంబ సభ్యులు క్వారంటైన్​ లో ఉన్నారు. కరోనా పరీక్షలు చేయించుకోగా.. వీఆర్వోకు అతడి కుటుంబసభ్యులకు కరోనా పాజిటివ్​గా నిర్ధారణ అయ్యింది.

Read More

గోకుల్​చాట్​ ఓనర్​కు కరోనా

సారథిన్యూస్​, హైదరాబాద్:​ తెలంగాణ రాష్ట్రంలో కరోనా రోజురోజుకు కోరలు చాస్తున్నది. తాజాగా హైదరాబాద్​ కోఠిలోని గోకుల్​ చాట్​ యాజమాని విజయ్​కు కరోనా పాజిటివ్​గా నిర్ధారణ అయ్యింది. దీంతో అధికారులు దుకాణాన్ని మూసివేయించారు. షాప్​లో పనిచేసే 20 మంది సిబ్బందిని క్వారంటైన్​కు తరలించారు. దీంతో ఇటీవల గోకుల్​చాట్​కు వెళ్లిన వారిలో ఆందోళన మొదలైంది. అధికారులు ఇటీవల షాపునకు వెళ్లినవారి వివరాలు సేకరిస్తున్నారు.

Read More

కరోనాకు వ్యాక్సిన్​ రెడీ

అమెరికాకు చెందిన ఓ పరిశోధనసంస్థ కరోనాకు వ్యాక్సిన్​ను సిద్ధం చేస్తున్నది. రెమ్​డెసివీర్​ అనే వ్యాక్సిన్​ కోవిడ్​ కు కొంతవరకు అశాజనకంగా పనిచేస్తున్నదని వైద్యులు చెప్తున్నారు. దీంతో దీన్ని ఉత్పత్తి చేసేందుకు అమెరికాకు చెందిన ప్రముఖ పరిశోధన సంస్థ గిలీడ్ ఆసక్తి చూపుతున్నది. ఈ సంస్థ ఇండియాలోని సిప్లా, జుబిలెంట్ లైఫ్ సైన్స్, హెటిరో ఫార్మా, డాక్టర్ రెడ్డీస్, జైడస్, క్యాడిలా ఫార్మా కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ కంపెనీలు వ్యాక్సిన్ ను తయారు చేసి 127 దేశాలకు […]

Read More

ఉచిత కరోనా టెస్టులు షురు

సారథి న్యూస్​ హైదరాబాద్​: జీహెచ్​ఎంసీలో ఉచిత కరోనా పరీక్షలు ప్రారంభమయ్యాయి. కొండాపూర్​, సరూర్​నగర్​, వనస్థలిపురం ఏరియా దవాఖానల్లో ఉచితంగా కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. జీహెచ్​ఎంసీ పరిసరాల్లో 50వేల కరోనాటెస్టులు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో ఆరోగ్యసిబ్బంది పరీక్షలు చేస్తున్నారు.

Read More

మరో ఎమ్మెల్యేకు కరోనా

సారథిన్యూస్​, నిజామాబాద్​ రూరల్​: కరోనా మహమ్మారి సామాన్య ప్రజానికంతోపాటు ప్రజాప్రతినిధులను వణికిస్తున్నది. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలోని జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డికి పాజిటివ్ రాగా తాజాగా నిజామాబాద్​ అర్బన్​ ఎమ్మెల్యే బిగాల గణేశ్​గుప్తాకు కరోనా వచ్చింది. గత రెండు రోజులుగా కోవిడ్‌ లక్షణాలు కనిపించడంతో ఎమ్మెల్యే పరీక్షలు చేయించుకోగా పాజిటివ్‌ అని తేలింది. బాజిరెడ్డి గోవర్ధన్‌తో ఎమ్మెల్యే బిగాల కాంటాక్ట్ అయినట్టు ప్రచారం సాగుతోంది. మరోవైపు ఇటీవల […]

Read More

కంటి వైద్యుడికి కరోనా

వరంగల్ రూరల్ జిల్లా: రాష్ట్రంలో కరోనా మహమ్మారి కోరలు చాస్తున్నది. జర్నలిస్టులు, వైద్యులు, ప్రభుత్వ అధికారులు ఎవ్వరినీ వదలడం లేదు. తాజాగా వరంగల్​ జిల్లాకు చెందిన ప్రముఖ కంటి వైద్య నిపుణుడు డాక్టర్ మెరుగు సుధాకర్ కరోనా బారినపడ్డారు. నర్సంపేట పట్టణంలోని ఓ ప్రైవేట్​ ఆసుపత్రిలో గత ఆదివారం డాక్టర్ సుధాకర్ 70 మంది రోగులకు వైద్య పరీక్షలు నిర్వహించినట్టు సమాచారం. ఆయన ప్రస్తుతం సూర్యాపేట కరోనా ప్రత్యేకాధికారిగా బాధ్యతలు నిర్వహిస్తుండటం గమనార్హం

Read More

కరోనాపై నిర్లక్ష్యం తగదు

సారథిన్యూస్​, మహబూబాబాద్​: ప్రైవేట్​ ఆస్పత్రుల్లోనూ కరోనా పరీక్షలను ఉచితంగా చేయాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి అల్వాల వీరయ్య డిమాండ్​ చేశారు. అవసరమైతే ప్రైవేట్​ ఆస్పత్రులను ప్రభుత్వమే తన ఆధీనంలోకి తీసుకోవాలని సూచించారు. కరోనా టెస్టుల విషయంలో ప్రభుత్వం అలసత్వం ప్రదర్శిస్తున్నదని మండిపడ్డారు. కరోనా టెస్టుల్లో ప్రభుత్వ తీరుకు నిరసనగా సోమవారం ఆయన మహబూబాబాద్​లోని పెరుమాండ్ల భవన్​లో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఇంటింటికి కరోనా టెస్టులు నిర్వహించాలని డిమాండ్ చేశారు. […]

Read More