Breaking News

CARONA

కందనూలులో కరోనా కలకలం

సారథిన్యూస్​, నాగర్​కర్నూల్​: నాగర్​కర్నూల్​ జిల్లాలో కరోనా కలకలం సృష్టిస్తున్నది. ఇప్పటికే జిల్లాకు చెందిన ముగ్గురికి కరోనా సోకగా.. తాజాగా జిల్లా దవాఖానలో ఇద్దరు సిబ్బందికి కరోనా పాజిటివ్​గా నిర్ధారణ అయినట్టు కలెక్టర్​ శ్రీధర్​ వెల్లడించారు. నాగర్​కర్నూల్​, కల్వకుర్తి ప్రభుత్వ దవాఖానలో పనిచేస్తున్న మొత్తం 27 మంది నమూనాలను పరీక్షించగా.. అందులో ఇద్దరికి కరోనా పాజిటివ్​ వచ్చినట్టు తెలిపారు. నాగర్ కర్నూల్ జిల్లా ఆస్పత్రిలో పనిచేస్తున్న ఒక స్టాఫ్ నర్స్ కు, సెక్యూరిటీ సిబ్బంది కరోనా పాజిటివ్ నిర్ధారణ […]

Read More

దిమిత్రోవ్, కొరిచ్​కు కరోనా

క్రొయేషియా: టెన్నిస్ క్రీడలో కరోనా వైరస్ కలకలం సృష్టించింది. గత వారం నిర్వహించిన ఏడ్రియా టూర్ ఎగ్జిబిషన్ టోర్నీలో పాల్గొన్న గ్రిగర్ దిమిత్రోవ్ (బల్గేరియా), బోర్నా కొరిచ్ (క్రొయేషియా)లకు కరోనా పాజిటివ్ గా తేలింది. దీంతో ఆ టోర్నీలో ఆడిన ప్లేయర్లకు వైరస్ భయం పట్టుకుంది. అలాగే మ్యాచ్​కు హాజరైన నాలుగు వేల మంది ప్రేక్షకుల్లో కూడా ఆందోళన మొదలైంది. ప్రపంచ నంబర్​వన్​ ప్లేయర్ నొవాక్ జొకోవిచ్ ఈ టోర్నీని ఏర్పాటు చేయడంతో అతనిపై విమర్శలు మొదలయ్యాయి. […]

Read More

ఏపీ ఎమ్మెల్యేకు కరోనా

సారథిన్యూస్​, విజయనగరం: దేశవ్యాప్తంగా పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీలకు కరోనా వైరస్​ సోకుతున్న విషయం తెలిసిందే. తాజాగా ఆంధ్రప్రదేశ్​ విజయనగరం జిల్లా శృంగవరపు కోట ఎమ్మెల్యే శ్రీనివాసరావుకు కరోనా సోకింది. గత రెండురోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయనకు తాజాగా నిర్వహించిన పరీక్షల్లో కరోనా పాజిటివ్​గా తేలింది. ప్రస్తుతం ఆయనకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఇప్పటికే జిల్లాలోని ఓ డిప్యూటీ తహసీల్దార్​కు కరోనా సోకినట్టు సమాచారం.

Read More

కరోనా కాలంలో కాసుల వేట

సారథి న్యూస్​, హైదరాబాద్​: కరోనా కాలంలో అధికాదాయాన్ని పొందేందుకు ప్రైవేట్​ ఆస్పత్రుల యజమానులు పూనుకున్నారు. రోగుల నుంచి లక్షల రూపాయలు ముక్కుపిండి వసూలు చేస్తున్నారు. ప్రభుత్వం కూడా దానిగురించి పట్టించుకోకపోవడంతో వారు ఆడిందే ఆటగా మారింది. గతంలోనూ ఈ ఆసుపత్రులు భారీగానే డబ్బులు వసూలు చేసేవి. కానీ, ఇప్పుడు కరోనా కాలం వారికి బాగా కలిసివచ్చింది. నిన్న మొన్నటి వరకు కరోనా చికిత్సలు ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే జరిగేవి. టెస్టులు కూడా అక్కడే చేసేవారు. కానీ, ఇప్పుడు పరీక్షల […]

Read More

కరోనా టెస్టులు పెంచాలి

సారథి న్యూస్, హుస్నాబాద్ : కరోనా వైరస్ ను అరికట్టడంలో టీఆర్ఎస్ ప్రభుత్వం విఫలమైందని బీజేపీ హుస్నాబాద్​ మండలాధ్యక్షుడు గొల్లపల్లి వీరాచారి అన్నారు. సోమవారం అక్కన్నపేట హెల్త్​సెంటర్​ ఎదుట ఆందోళన చేపట్టారు. రోజురోజుకు కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో పారిశుద్ధ్య కార్మికులు, జర్నలిస్టులు, పోలీసులు అత్యవసర విభాగాల్లో పనిచేస్తున్నవారికి కోవిడ్-19 టెస్టులు చేయాలన్నారు. అనంతరం అక్కన్నపేట వైద్యాధికారికి వినతిపత్రం అందజేశారు. బిజెపి నాయకులు సంపత్ కుమార్, కార్తీక్, కృష్ణ, వంశీ, రాహుల్, కళ్యాణ్, సాయిరాం పాల్గొన్నారు.

Read More

కరోనా కట్టడిలో టీఆర్​ఎస్​ విఫలం

సారథి న్యూస్, హుస్నాబాద్: కరోనా మహమ్మారిని అరికట్టడంలో తెలంగాణ ప్రభుత్వం విఫలమైందని బీజేపీ నేతలు ఆరోపించారు. సోమవారం కరీంనగర్​ జిల్లా అక్కన్నపేటలో ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా బీజేపీ నేతలు మాట్లాడుతూ.. రాష్ట్రంలో టీఆర్​ఎస్​ ప్రభుత్వం కరోనా టెస్టులు చేయడం లేదని ఆరోపించారు. అనంతరం అక్కన్నపేట వైద్యాధికారికి వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో బీజేపీ నేతలు సంపత్ కుమార్, కార్తీక్, కృష్ణ, వంశీ, రాహుల్, కల్యాణ్​, సాయిరాం తదితరులు పాల్గొన్నారు.

Read More

కరోనా టెస్టులు పెంచండి

సారథి న్యూస్, రామాయంపేట/రామడుగు: రాష్ట్రంలో కరోనా టెస్టుల సంఖ్య పెంచాలని భారతీయ జనతాపార్టీ డిమాండ్​ చేసింది. కరోనా వార్డుల్లో పనిచేసే సిబ్బందికి, డాక్టర్లకు పీపీఈ కిట్లు ఇవ్వాలని కోరింది. మెదక్ జిల్లా రామాయంపేట ప్రభుత్వ దవాఖాన ఎదుట, కరీంనగర్​ జిల్లా రామడగులోనూ బీజేపీ నేతలు సోమవారం ఆందోళన చేపట్టారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఆయుష్మాన్​ భారత్​ స్కీమ్​లో చేర్చాలని డిమాండ్​ చేశారు. కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చాలన్నారు. కార్యక్రమంలో రామడుగు బీజేపీ మండల అధ్యక్షుడు ఒంటెల కర్ణాకర్ రెడ్డి, రామయంపేట […]

Read More

అడకత్తెరలో పోక చెక్కలా..!

ఇండియాలో ప్రజల పరిస్థితి అడకత్తెరలో పోకచెక్కలా తయారైంది. కరోనా తల్లడిల్లుతున్న జనాలను కాపాడాల్సిన సర్కారు వారి నుంచి ముక్కుపిండి డబ్బులు వసూలు చేసే కార్యక్రమానికి పదును పెట్టింది. ఇప్పటికే పనులు లేక ఆదాయం రాక అవస్థలు పడుతున్న జనంపై పెట్రోలియంపై పన్నులు పెంచి మూలిగే నక్కపై తాటికాయ పడ్డట్టుగా చేసింది. దేశంలో కరోనా కలకలం రేపుతోంది. ప్రజల ప్రాణాలనే కాదు.. జీవితాలను కూడా దుర్భరం చేసింది. రెండు నెలలకు పైగా ప్రభుత్వాలు లాక్‌డౌన్‌ విధించాయి. దీంతో చిరు […]

Read More