Breaking News

CARONA

కరోనా టీకా తప్పనిసరి వేయించుకోవాలి

కరోనా టీకా తప్పనిసరి వేయించుకోవాలి

సారథి, మానవపాడు: కరోనా సెకండ్ వేవ్ ఉధృతి నేపధ్యంలో ప్రతిఒక్కరూ కరోనా టీకా వేయించుకోవడంతో పాటు మాస్కులు ధరించి, భౌతిక దూరం పాటించాలని డాక్టర్ సవిత సూచించారు. మంగళవారం జోగుళాంబ గద్వాల జిల్లా మానవపాడు ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలో వ్యాక్సిన్ నేషన్ నిర్వహించారు. ముందుగా రిజిస్ట్రేషన్ చేయించుకుని కరోనా నివారణ టీకాను వేయించుకోవాలన్నారు. వ్యాక్సిన్ పై అపోహలు వద్దని ఆమె సూచించారు. ఏదైనా అత్యవసర పనిమీద బయటకొచ్చి ఇంటికి వెళ్లి తప్పనిసరిగా కాళ్లు, చేతులను సబ్బుతో పరిశుభ్రంగా కడుక్కోవాలని […]

Read More
కరోనా టెస్టులకు బారులు

కరోనా టెస్టులకు బారులు

సారథి, రామడుగు: కరోనా సెకండ్ వేవ్ ఉధృతమవుతున్న నేపథ్యంలో అధిక మంది టెస్టులు చేసుకునేందుకు ప్రజలు స్వచ్ఛందంగా ముందుకొస్తున్నారు. కరీంనగర్​జిల్లా రామడుగు ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటుచేసిన టెస్టింగ్ సెంటర్ లో కరోనా పరీక్షల కోసం జనం బారులుదీరారు. కానీ టెస్టింగ్​ కిట్లు లేకపోవడంతో చాలా మంది నిరాశతో వెనుదిరిగారు.

Read More
కరోనా పరీక్షలు వేగవంతం చేయాలి

కరోనా పరీక్షలు వేగవంతం చేయాలి

సారథి, రాయికల్: కరోనా ఉధృతి పెరుగుతున్న దృష్ట్యా వైరస్ నివారణ పరీక్షలు వేగవంతం చేయాలని కరీంనగర్​ రాయికల్ మండల మహేంద్ర సంఘం ప్రధాన కార్యదర్శి చిలివేరి నాగరాజు అన్నారు. ప్రతిరోజు చేస్తున్న కరోనా ర్యాపిడ్ నిర్ధారణ పరీక్షలు సంఖ్యను పెంచాలన్నారు. వ్యాక్సిన్ కొరత అధికంగా ఉండటంతో తీవ్రఇబ్బందులు పడుతున్నారని అన్నారు. వ్యాక్సిన్ వేయించుకోవడానికి మండల సామాజిక ఆరోగ్య కేంద్రానికి పెద్దఎత్తున ప్రజలు రావడంతో అక్కడ ఎవరికైనా కరోనా లక్షణాలు ఉంటే వైరస్ ఎక్కువ మందికి అంటుకునే ప్రమాదం […]

Read More
కరోనా కట్టడిలో ప్రభుత్వాలు విఫలం

కరోనా కట్టడిలో ప్రభుత్వాలు విఫలం

సారథి, వేములవాడ: ఏఐసీసీ పిలుపుమేరకు శనివారం వేములవాడ నియోజకవర్గం రుద్రంగి మండల కేంద్రంలో కార్మికులతో పాటు పలువురికి మాస్కులు పంపిణీ చేశారు. ముఖ్యఅతిథిగా టీపీసీసీ కార్యదర్శి ఆది శ్రీనివాస్ హాజరయ్యారు. ప్రస్తుతం కరోనా మహమ్మారి విలయతాండవగా చేస్తున్న తరుణంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమై ప్రజల ప్రాణాలు పోతున్నాయని ఆయన అన్నారు. కొవిడ్​ బాధితులకు రెమిడెసివిర్​ఇంజక్షన్లు, అక్సిజన్​అందించడంలో, ఆస్పత్రుల్లో బెడ్లు సమకూర్చడంలోనూ ప్రభుత్వాలు విఫలమయ్యాయని ధ్వజమెత్తారు. ప్రజలంతా జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో డీసీసీ కార్యదర్శి చిలకల […]

Read More
కరోనా టెస్టులకు చెప్పులే క్యూ లైన్​

కరోనా టెస్టులకు చెప్పులే క్యూ లైన్​

సారథి, చొప్పదండి: కరోనా వ్యాప్తి పెరుగుతుండడంతో జనం హడలిపోతున్నారు. కరీంనగర్​జిల్లా చొప్పదండి మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి టెస్టుల కోసం జనం తాకిడి పెరిగింది. తెల్లవారుజాము నుంచి మొదలు కుని మధ్యాహ్నం వరకు ఎండలోనే ఉండి టెస్టులు చేయించుకోని పోతున్నారు. శుక్రవారం ఇలా కొంతమంది తమ చెప్పులు, ఇంకొంతమంది ఆధార్​కార్డులను క్యూ లైన్​ఉంచి మరీ పరీక్షలు చేయించుకుంటున్నారు. చివరికి కిట్లు లేవని వైద్యసిబ్బంది చెప్పడంతో నిరాశతో వెనుదిరుగుతున్నారు. ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో కిట్ల సంఖ్య పెంచాలని […]

Read More
కరోనా బాధితుల పట్ల సర్పంచ్​ ఉదారత

కరోనా బాధితుల పట్ల సర్పంచ్​ ఉదారత

సారథి, రామడుగు: కరీంనగర్​ జిల్లా రామడుగు మండలంలోని తిర్మలాపూర్ గ్రామంలో శుక్రవారం సర్పంచ్ బక్కశెట్టి నర్సయ్య కరోనా బాధిత ఆరు కుటుంబాలకు వారానికి సరిపడా నిత్యవసరాలు, కూరగాయలు, బియ్యం, కోడిగుడ్లు పంపిణీ చేసి ఉదారత చాటుకున్నాడు. ఎవరు భయపడకుండా డాక్టర్లు సూచించిన మందులు వాడాలని ఆయన సూచించారు. మెడిసిన్​ వాడుతూనే పౌష్టికాహారం తీసుకోవాలని కోరారు. గోపాల్​ రావుపేట ఏఎంసీ వైస్ చైర్మన్ తడగొండ అజయ్, పంచాయతీ కార్యదర్శి శిరీష్, టీఆర్ఎస్ నాయకులు తడగొండ నర్సింబాబు, ఆశావర్కర్లు, గ్రామపంచాయతీ […]

Read More
జర్నలిస్టులను ఫ్రంట్ లైన్ వారియర్స్ గా గుర్తించాలి

జర్నలిస్టులను ఫ్రంట్ లైన్ వారియర్స్ గా గుర్తించాలి

సారథి, వేములవాడ: జర్నలిస్టులను ఫ్రంట్ లైన్ వారియర్స్ గా గుర్తించాలని వేములవాడ టీయూడబ్ల్యూజేహెచ్(143) ప్రెస్ క్లబ్ ఉపాధ్యక్షుడు మహమ్మద్ రఫీ ప్రభుత్వాన్ని కోరారు. జర్నలిస్టులందరికీ కరోనా టెస్టులు చేసి మెరుగైన వైద్యం అందించాలన్నారు కోరారు. ఈ మేరకు రాజన్న సిరిసిల్ల అడిషనల్ కలెక్టర్ అంజయ్యకు వినతిపత్రం అందజేశారు. వేములవాడతోపాటు రాజన్న సిరిసిల్ల జిల్లాలో పనిచేస్తున్న జర్నలిస్టులకు కరోనా వ్యాక్సిన్​ వేయాలని విజ్ఞప్తిచేశారు. జర్నలిస్టులకు అక్రిడిటేషన్​కార్డులు ఇవ్వాలని డిమాండ్​చేశారు. ఆయన వెంట ప్రెస్​క్లబ్​ప్రధాన కార్యదర్శి భాస్కర్​రెడ్డి, ఇతర జర్నలిస్టులు […]

Read More
ఇంట్లో సదుపాయాలు లేని వారికి ఐసొలేషన్​ సెంటర్లు

ఇంట్లో సదుపాయాలు లేని వారికి ఐసొలేషన్​ సెంటర్లు

సారథి, వేములవాడ: కరోనా పాజిటివ్ వచ్చి హోం క్వారంటైన్ సౌకర్యం లేనివారు తాము ఉండడానికి వీలుగా వేములవాడ పట్టణంలోని లక్ష్మీగణపతి కాంప్లెక్స్, సిరిసిల్ల మున్సిపాలిటీ పరిధిలోని సర్ధాపూర్ వ్యవసాయ పాలిటెక్నిక్ కాలేజీలో ఏర్పాటుచేసిన ఐసొలేషన్ కేంద్రాల్లో ఉండొచ్చని ఇన్ చార్జ్ ​జిల్లా వైద్యాధికారి డాక్టర్​శ్రీరాములు తెలిపారు. సరైన సదుపాయం ఉన్నవారు ఇంట్లోనే ఉండాలని, హోం క్వారంటైన్ సదుపాయం లేని వారు ఈ ఐసొలేషన్ కేంద్రాలను వినియోగించుకోవాలని సూచించారు. కొవిడ్​ సెకండ్​ వేడ్​ ప్రభావం చాలా తీవ్రంగా ఉందని, […]

Read More