Breaking News

CARONA

కరోనా @ 1,850

కరోనా.. హైరానా

సారథి న్యూస్, తెలంగాణ: తెలంగాణలో పెద్దసంఖ్యలో కరోనా కేసులు నమోదుతున్నాయి. శనివారం 1,850 కేసులు పాజిటివ్ గా తేలాయి. ఇప్పటివరకు 22,312కు కేసులు చేశారు. 1,342 మంది ట్రీట్​మెంట్​అనంతరం డిశ్చార్జ్​అయ్యారు. తాజాగా ఐదుగురు మృత్యువాతపడ్డారు. ఇప్పటివరకు 288 మంది మృతిచెందారు. అత్యధికంగా జీహెచ్​ఎంసీ నుంచి 1,572 కేసులు, జిల్లాల వారీగా.. రంగారెడ్డి 92, మేడ్చల్​53, వరంగల్​అర్బన్​31, కరీంనగర్​18, నిజామాబాద్​17 చొప్పున కేసులు నమోదయ్యాయి.

Read More
పోకూరి రామారావు సినీ నిర్మాత

కరోనాతో సినీ నిర్మాత పోకూరి మృతి

తెలుగు సినీ నిర్మాత పోకూరి రామారావు (64) కరోనాతో మృతిచెందారు. దీంతో చిత్రపరిశ్రమలో విషాదం నెలకొన్నది. ఈ తరం ఫిలింస్‌ అధినేత పోకూరి బాబురావు సోదరుడు పోకూరి రామారావు. కరోనా బారినపడటంతో రామారావు ఆస్పత్రిలో చేరి చికిత్స తీసుకున్నప్పటికీ పరిస్థితి విషమించడంతో తుదిశ్వాస విడిచారు. ఈ తరం ఫిలింస్‌ బ్యానర్‌పై తెరకెక్కిన సినిమాలకు రామారావు సమర్పకుడిగా వ్యహహరించేవారు. ఇక బిగ్‌బాస్‌-3తో పాపులర్‌ అయిన రవికృష్ణ, సీరియల్‌ నటి నవ్య స్వామి, ప్రముఖ బుల్లితెన నటులైన ప్రభాకర్, రాజశేఖర్, […]

Read More
కరోనా.. ఇదేం లెక్క?

కరోనా.. ఇదేం లెక్క?

సారథి న్యూస్​, హైదరాబాద్​: తెలంగాణలో కరోనా లెక్క తప్పుతోంది. జిల్లా వైద్యశాఖ అధికారులు ఇస్తున్న లెక్కలు, రాష్ట్రస్థాయిలో విడుదల అవుతున్న హెల్త్‌ బులెటిన్‌లో ఇస్తున్న లెక్కలకు మధ్య భారీగా తేడాలు ఉంటున్నాయి. దీంతో కరోనా కేసులు, మృతులపై తెలంగాణవాసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. జిల్లాల్లో ఎక్కడెక్కడ ఎంతమందికి సోకిందన్న పూర్తి వివరాలతో పాటు రోజువారీ లెక్కను జిల్లా వైద్యశాఖాధికారులు తమ బులెటిన్‌లో విడుదల చేస్తున్నారు. కానీ, ఆ లెక్కలేవీ రాష్ట్రస్థాయి బులెటిన్‌లో కనిపించడం లేదు. బుధవారం రంగారెడ్డి […]

Read More
కరోనా.. మజాకా

కరోనా.. మజాకా

సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి అంతకంతకూ పెరుగుతోంది. ఒకరి నుంచి మరొకరిని చుట్టేస్తోంది. శుక్రవారం తాజాగా తెలంగాణలో కొత్తగా 1,892 కరోనా పాజిటివ్ కేసులు నమోదుకావడం సంచలనం రేపుతోంది. రాష్ట్రంలో మొత్తం పాజిటివ్​కేసుల సంఖ్య 20,462కు చేరింది. తాజాగా 8 మంది చనిపోయారు. ఇలా ఇప్పటి వరకు 283 మంది మృత్యువాతపడ్డారు. 10,195 మంది డిశ్చార్జ్ అయ్యారు. యాక్టివ్ కేసుల సంఖ్య 9,984 కు చేరింది. జిల్లాల వారీగా పరిశీలిస్తే..జీహెచ్​ఎంసీ పరిధిలో 1,658, […]

Read More
నార్లాపూర్ లో కరోనా పాజిటివ్​

నార్లాపూర్ లో కరోనా పాజిటివ్​

సారథి న్యూస్, రామాయంపేట: మెదక్​ జిల్లా నిజాంపేట మండలం నార్లాపూర్ గ్రామంలో తొలి కరోనా కేసు నమోదైంది. మేడ్చల్ లో నివాసం ఉంటున్న ఓ వ్యక్తికి కరోనా లక్షణాలు తేలడంతో వైద్యసిబ్బంది హోం క్వారంటైన్​ ముద్రవేశారు. అయినప్పటికీ సదరు వ్యక్తి నార్లాపూర్ లో ఉన్న తన బంధువుల వద్దకు వెళ్లడంతో శుక్రవారం వారిని కూడా వైద్యపరీక్షల కోసం తీసుకెళ్లారు.

Read More

పిల్లలూ.. పైలం

సారథిన్యూస్​, హైదరాబాద్​: కరోనా సృష్టించిన సంక్షోభం ఇప్పుడు పసిపిల్లలపైనా పడింది. ఆన్​లైన్​ క్లాసుల పేరుతో చిన్నపిల్లలు తరుచూ ల్యాప్​టాప్,​ ట్యాబ్​, స్మార్ట్​ ఫోన్​ వంటి ఎలక్ట్రానిక్​ గాడ్జెట్ల ముందు గంటల తరబడి ఉండాల్సి వస్తున్నది. దీంతో పిల్లల కళ్లపై తీవ్ర భారం పడతుందని.. తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే కంటి సంబంధిత వ్యాధులు వస్తాయని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు.ఎనిమిది గంటలపాటు..ఆన్‌లైన్‌ క్లాసులు ప్రారంభమైన తర్వాత విద్యార్థులు డిజిటల్‌ పరికరాలను వినియోగించడం పరిపాటిగా మారింది. మొదట్లో రెండు లేదా మూడు గంటలే […]

Read More

కోలుకున్న మహమూద్‌ అలీ

సారథిన్యూస్​, హైదరాబాద్‌: రాష్ట్ర హోంమంత్రి మహమూద్‌ అలీ కరోనా నుంచి కోలుకున్నారు. శుక్రవారం చేసిన పరీక్షలో ఆయనకు నెగెటివ్​ వచ్చింది. మంత్రితోపాటు ఆయన కుమారుడు, మనువడు కూడా శుక్రవారం డిశ్చార్జ్‌ అయ్యారు. ఆదివారం మంత్రికి కోవిడ్‌ పరీక్షలు చేయగా పాజిటివ్‌ రావడంతో ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరి చికిత్స తీసుకున్నారు. ‘మేం త్వరగా కోలుకోవాలని ప్రార్థించిన  ప్రతిఒక్కరికీ ధన్యవాదాలు’ అని మంత్రి తెలిపారు. ఇప్పటికే ఆయన  సిబ్బందిలో ఐదుగురికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిన విషయం తెలిసిందే. 

Read More

కరోనా లక్షణాలతో యువతి మృతి

సారథి న్యూస్, వరంగల్ రూరల్: కరీంనగర్​ జిల్లా చెన్నరావుపేట మండలం పాపయ్యపేటకు చెందిన ఓ యువతి కరోనా లక్షణాలతో మృతిచెందింది. ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్న సదురు యువతిని గురువారం తల్లిదండ్రలు వరంగల్​లోని ఎంజీఎం ఆస్పత్రిలో చేర్పించారు. ఆమె నుంచి శాంపిల్స్​ సేకరించే లోపే మృతిచెందిందని వైద్యులు తెలిపారు. కాగా పాపయ్యపేటలో యువతి అంత్యక్రియల్లో పాల్గొన్నవారిని హోంక్వారంటైన్​లో ఉంచారు. గ్రామస్థులంతా మాస్కులు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని అధికారులు కోరుతున్నారు.

Read More