సారథి న్యూస్, వాజేడు: ములుగు జిల్లా పేరూరు ఆరోగ్య కేంద్రం పరిధిలోని టేకులగూడెంలో డాక్టర్ సీతారామరాజు ఆధ్వర్యంలో శుక్రవారం కరోనా నిర్ధారణ పరీక్షలు చేశారు. 61మందికి వైద్యపరీక్షలు చేయగా.. అందరికీ నెగెటివ్ రిపోర్టు వచ్చింది. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో ముందు జాగ్రత్తగా వ్యాధి నిర్ధారణ టెస్టులు చేస్తున్నామని తెలిపారు. ఫార్మసిస్ట్ యాలం సతీశ్, హెల్త్ అసిస్టెంట్ కె.తిరుపతి రావు, ఎస్ఎన్ఎం జి.రజిత, ఎల్టీకే.అశ్విని, సర్పంచ్ వాసం కృష్ణవేణి, కార్యదర్శి యాలం వినోద పాల్గొన్నారు.
సారథి న్యూస్, హైదారాబాద్: సింగరేణి వ్యాప్తంగా అన్ని ఏరియా ఆస్పత్రుల్లో కోవిడ్ 19 వైద్యసేవల కోసం ఇప్పటివరకు రూ.8కోట్ల విలువైన మందులు, కిట్లు, సూట్లు పరికరాలను సిద్ధంగా ఉంచామని, మరో 21మంది డాక్టర్లను వైద్యసేవల కోసం తాత్కాలికంగా నియమించామని సంస్థ చైర్మన్, ఎండీ ఎం.శ్రీధర్ తెలిపారు. సోమవారం హైదరాబాద్ సింగరేణి భవన్ నుంచి వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రస్తుతం సింగరేణి ఆస్పత్రిల్లో కరోనాకు కేటాయించిన 643 బెడ్లకు అదనంగా మరో 600 బెడ్లను సిద్ధం చేసుకోవాలని వైద్యాధికారులకు సూచించారు. […]
శ్రీనగర్: జమ్మూకాశ్మీర్‌లోని కుల్గాం జిల్లాలో రెండు రోజుల క్రితం జరిగిన ఎన్‌కౌంటర్‌లో చనిపోయిన ఇద్దరు టెర్రరిస్టులకు కరోనా పాజిటివ్ వచ్చింది. డెడ్బాడీస్కు కరోనా టెస్టులు చేయగా పాజిటివ్ వచ్చిందని పోలీసులు వెల్లడించారు. మెడికో – లీగల్ పరీక్షల్లో భాగంగా టెస్టులు చేశామని, డీఎన్‌ఏ, కరోనా పరీక్షలు నిర్వహించామని పోలీసులు చెప్పారు. దీంతో కరోనా రూల్స్‌కు అనుగుణంగా బారాముల్లాలో అంత్యక్రియలు నిర్వహిస్తామని అన్నారు. జమ్మూకాశ్మీర్ జిల్లాల్లో పోలీసులు టెర్రరిస్టులు ఏరివేతే మొదలుపెట్టారు. గడిచిన ఆరు నెలల్లో దాదాపు 118 […]