హైదరాబాద్: ప్రతిఒక్కరూ మాస్క్‌ను ధరించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. లేకపోతే రూ.1000 జరిమానా విధిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఈ నిబంధనను శుక్రవారం నుంచి తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ ధరించకుంటే ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని, కోర్టులో హాజరుపర్చాలని సూచించింది. విపత్తు నిర్వహణచట్టంతో పాటుగా ఐపీసీలోని పలు సెక్షన్ల కింద కేసులు నమోదుచేయాలని పోలీసులను ఆదేశించింది.
సారథి, నల్లగొండ : కరోనా రెండోదశ తీవ్రమవుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ విధిగా మాస్కు ధరించాలని లేకపోతే జరిమానాలు తప్పవని నల్లగొండ డీఎస్పీ వెంకటేశ్వర్ రెడ్డి హెచ్చరించారు. గురువారం ట్రాఫిక్ సీఐ దుబ్బ అనిల్ కుమార్ ఆధ్వర్యంలో క్లాక్ టవర్ సెంటర్ లో మాస్కుల ప్రాధాన్యతపై వాహనదారులకు అవగాహన కల్పించారు. మాస్కులు లేకుండా వెళ్తున్న పలువురికి డీఎస్పీ స్వయంగా మాస్కులు తొడిగారు. కరోనా ఉద్ధృతి రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు డీఐజీ ఏవీ రంగనాథ్ […]