సామాజికసారథి, వెల్దండ: నాగర్కర్నూల్ జిల్లా వెల్దండ మండలంలోని భైరాపూర్ గ్రామంలో మూడు రోజుల నుంచి కొనసాగిన స్వయంభు లక్ష్మీనరసింహ స్వామి బ్రహ్మోత్సవాలు మంగళవారం ఉదయం రథోత్సవం , చక్రస్నానం, ఆశీర్వచనం, దీపోత్సవ కార్యక్రమాలతో బ్రహ్మోత్సవాలు ముగిశాయి. మూడు రోజులుగా నుంచి నిర్వహించిన కార్యక్రమాల్లో భాగంగా ఆదివారం సాయంత్రం స్వామి వారి కల్యాణ మహోత్సవం, సోమవారం నిత్యహోమం, పూర్ణహుతి, పుష్పయాగం తదితర కార్యక్రమంలో మంగళవారం రథోత్సవం ముగించారు. బ్రహ్మోత్సవాలకు గ్రామస్తులు, బంధువులు పెద్దఎత్తున తరలివచ్చారు. గ్రామంలో పండగ వాతావరణం […]
సామాజికసారథి, వెల్దండ: నాగర్కర్నూల్ జిల్లా వెల్దండ మండలంలోని బైరాపూర్ గ్రామంలో గురువారం పౌరహక్కుల దినోత్సవం సందర్భంగా ఎస్సై ఎం.నర్సింహులు, రెవెన్యూ అధికారులు, సర్పంచ్ దార్ల కుమార్ సమక్షంలో దళితులతో ఆలయ ప్రవేశం చేయించారు. మనుషులంతా ఒక్కటేనని, కులమత బేధాలు పాటించకూడదని సూచించారు. అంటరానితనం, మనుషుల విబేధాలు, వైషమ్యాలు అభివృద్ధికి ఆటంకంగా నిలుస్తాయని ఎస్సై నర్సింహులు గ్రామస్తులకు అవగాహన కల్పించారు. అందరూ కలిసిపోవాలని కోరారు. దైవం అందరికీ సమానమేనని అన్నారు. సాటి మనుషుల పట్ల వివక్ష చూపించడం చట్టరీత్యా […]
సామాజిక సారథి, వెల్దండ: నాగర్కర్నూల్ జిల్లా వెల్దండ మండలంలోని బైరాపూర్ గ్రామ సర్పంచ్ దార్ల కుమార్ జన్మదిన వేడుకలను మంగళవారం స్థానిక ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల మధ్య అట్టహాసంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థులకు విలువైన ఆట వస్తువులు, ఇతర పరికరాలను పంపిణీ చేశారు. అనంతరం మొక్కలు నాటి నీరు పోశారు. ఈ సందర్భంగా చిన్నారులు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఇలాంటి మరెన్నో పుట్టిన రోజులు జరుపుకోవాలని ఆకాంక్షించారు.