Breaking News

AYODYA

అయోద్యకు చేరుకున్న మోదీ

అయోధ్యకు చేరుకున్న మోదీ

అయోధ్య: ప్రధాని మోదీ అయోధ్యకు చేరుకున్నారు. ఢిల్లీ నుంచి ప్రత్యేకవిమానంలో అయోధ్యకు విచ్చేసిన ప్రధానికి ఉత్తర్​ప్రదేశ్​ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్​, పలువురు ఉన్నతాధికారులు ఘనస్వాగతం పలికారు. అనంతరం ఆయన అయోధ్యలోని హనుమాన్​గడికి చేరుకొని ప్రత్యేకపూజలు చేశారు. రామ్​లాలాలో పారిజాత మొక్కను నాటారు. అనంతరం 12.44 నిమిషాలకు ప్రధాని రామజన్మభూమిలో రామాలయానికి శంకుస్థాపన చేయనున్నారు.

Read More
రాముడి పుట్టిన ముహూర్తంలోనే..

రాముడు పుట్టిన ముహూర్తంలోనే..

అయోధ్య: దేశంలోని హిందువులంతా ఎదురుచూస్తున్న అయోధ్య రామమందిరం నిర్మాణం ప్రారంభం కానుంది. ప్రధాని నరేంద్ర మోడీ బుధవారం శంకుస్థాపన చేయనున్నారు. దీంతో అయోధ్య సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. సిటీలోని ఆలయాను, సరయూ నదీతీరాన్ని అందంగా తీర్చిదిద్దారు. ప్రధాని మోడీ అయోధ్యలో దాదాపు 3 గంటల పాటు గడపనున్నారు. బుధవారం ఉదయం స్పెషల్‌ ఫ్లైట్‌లో ఢిల్లీ నుంచి లక్నో చేరుకుంటారు. అక్కడ నుంచి స్పెషల్‌ చాపర్‌‌లో అయోధ్యకు వెళ్తారు. ఉత్తర్‌‌ప్రదేశ్‌లోని సరయూ నది తీరంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన […]

Read More
రాముడు అందరివాడు

రాముడు అందరివాడు

న్యూఢిల్లీ: అయోధ్య రామమందిరం భూమి పూజ నేపథ్యంలో కాంగ్రెస్‌ నేత ప్రియాంక గాంధీ ట్వీట్‌ చేశారు. రాముడు అందరివాడని ఆమె పేర్కొన్నారు. అయోధ్యలో జరిగే ఈ కార్యక్రమంతో దేశమంతా ఒకటవుతుందని ఆశిస్తున్నట్లు ఆమె చెప్పారు. ‘రాముడు అనే పదానికి అర్థం సరళత, ధైర్యం, నిగ్రహం, త్యాగం, నిబద్ధత, దీనబంధుడు. రాముడో అందరితో ఉన్నాడు. రాముడు, సీతాదేవి సందేశంతో, రామ్‌లాల ఆలయ భూమి పూజ సమాజంలో ఐక్యత, సోదరభావం కలగజేయాలని కోరుకుంటున్నాను’ అని ప్రియాంకగాంధీ ట్వీట్‌ చేశారు. అయోధ్యలో […]

Read More
అంతా రాముడి దయతో..

అంతా రాముడి దయతో..

ముంబై: అయోధ్యలో రామమందిరం నిర్మాణం శుభపరిణామమని శివసేన అభిప్రాయపడింది. ప్రధాని చేతుల మీదుగా బుధవారం భూమిపూజ చేయాల్సిన మంచి క్షణం మరొకటి లేదని, శ్రీరాముని దయ వల్ల కరోనా కనుమరుగు అవుతోందని చెప్పింది. రామమందిర ఉద్యమంలో చురుకుగా పాల్గొన్న బీజేపీ సీనియర్‌‌ నేతలు ఎల్‌కే. అద్వానీ, మురళీ మనోహర్‌‌ జోషీ వయోభారం వల్ల వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా హాజరవుతారని చెప్పింది. అయోధ్యలో భద్రతా చర్యలు కట్టుదిట్టం చేశారని, హోం మంత్రిత్వ శాఖ దానికి సంబంధించి ఏర్పాట్లు చేస్తోందని […]

Read More
మరికొద్ది గంటల్లో అయోధ్యలో మహాఘట్టం

మరికొద్ది గంటల్లో అయోధ్యలో మహాఘట్టం

న్యూఢిల్లీ: అయోధ్య మహాఘట్టానికి వేళయింది. ఆలయ నిర్మాణానికి బుధవారం మధ్యాహ్నం ప్రధాని మోడీ శంకుస్థాపన చేయనున్నారు. శ్రీరాముడి జన్మభూమి అయోధ్యలో బృహత్తర రామాలయం నిర్మాణానికి మరికొన్ని గంటల్లో భూమిపూజ మహోత్సవం జరగనుంది. ప్రధాని నరేంద్రమోడీ స్వయంగా గర్భగుడిలో 40 కిలోల వెండి ఇటుకలను ప్రతిష్ఠించి..నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయనున్నారు. సంఘ్‌ అధినేత మోహన్‌ భగవత్‌ తదితరులు రానున్నారు. బీజేపీ అగ్రనేతలు ఎల్‌కే అద్వానీ, మురళీ మనోహర్‌ జోషి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా కార్యక్రమంలో పాల్గొంటారు.ఇదీ చరిత్రసరయూనది ఒడ్డున […]

Read More
అయోధ్యకు.. ముస్లింకే మొదటి ఆహ్వానం

అయోధ్యకు.. ముస్లింకే మొదటి ఆహ్వానం

న్యూఢిల్లీ: అయోధ్య రామమందిర నిర్మాణం భూమి పూజకు రావాలని బాబ్రీమసీదు కోసం న్యాయపోరాటం చేసిన ఇక్బాల్ అన్సారీకి సోమవారం తొలి ఆహ్వానపత్రిక అందింది. అయోధ్య రామజన్మభూమి వివాదంపై ముస్లింల తరఫున బలంగా గళం వినిపించిన వారిలో అన్సారీ ఒకరు. తనను ఆహ్వానించడంపై అన్సారీ హర్షం వ్యక్తంచేశారు. ‘నాకు తొలి ఆహ్వానం అందాలన్నది సాక్షాత్తూ శ్రీరాముడి ఆకాంక్ష అని భావిస్తున్నాను. అందుకే దీన్ని మనస్ఫూర్తిగా స్వీకరిస్తున్నాను..’ అని అన్సారీ అన్నారు.180 మందికి మాత్రమే ఆహ్వానంఈనెల 5న ఉత్తర ప్రదేశ్‌లోని అయోధ్యలో […]

Read More
అయోధ్యపై గట్టినిఘా

అయోధ్యపై గట్టి నిఘా

లఖ్‌నవూ: ఆగస్టు 5న అయోధ్యలో జరగబోయే రామ మందిర నిర్మాణానికి భూమిపూజ వేడుకను భగ్నం చేయడంతో పాటు విధ్వంసం సృష్టించేందుకు పాకిస్థాన్‌ ఐఎస్‌ఐ కుట్ర పన్నుతోందని కేంద్రనిఘా వర్గాలకు సమాచారం అందింది. ఈ నేపథ్యంలో దీంతో అయోధ్య, ఢిల్లీ, జమ్మూకశ్మీర్‌లో భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. ముమ్మర తనిఖీలు చేపడుతున్నాయి. నిఘావర్గాల హెచ్చరికల నేపథ్యంలో అయోధ్యలో హై అలర్ట్‌ ప్రకటించారు. అయోధ్యలో భూమిపూజ నిర్వహించే రోజు, జమ్మూకశ్మీర్‌ ఆర్టికల్‌ 370ను రద్దుచేసిన రోజు ఆగస్టు 5 కావడంతో భద్రతా […]

Read More
రామమందిర పూజకు మోదీ

ఆగస్టు 5న అయోధ్యకు ప్రధాని

న్యూఢిల్లీ : అయోధ్య రామమందిర నిర్మాణ భూమిపూజకు ఆగస్టు 5న ప్రధాని నరేంద్రమోదీ హాజరుకానున్నారు. ఈ మేరకు సోమవారం ప్రధాని కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. ఆయోధ్య రామమందిర భూమిపూజకు హాజరు కావల్సిందిగా శ్రీరామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్​ చైర్మన్​ మోదీకి ఆహ్వానం పంపిన విషయం తెలిసిందే. ప్రధానితో పాటు మరో 250 మంది అతిథులు కూడా హాజరుకాన్నారు. రాష్ట్రీయ స్వ‌యంసేవ‌క్ సంఘ్‌, విశ్వ హిందు ప‌రిష‌త్ సీనియ‌ర్ ప్ర‌తినిధులు, మహారాష్ట్ర ముఖ్యమం‍త్రి, శివసేన చీఫ్‌ […]

Read More