Breaking News

ANDRAPRADESH

వక్ఫ్‌బోర్డు భూములు అమ్మేశారు

వక్ఫ్‌బోర్డు భూములు అమ్మేశారు

సారథి న్యూస్​, కర్నూలు: గత ప్రభుత్వం నిర్లక్ష్యం పాలకుల కక్కుర్తి కారణంగా ఓ వర్గానికి చెందిన వేలాది ఎకరాల భూములు అన్యాక్రాంతమయ్యాయని కర్నూలు నగర ఎమ్మెల్యే ఎంఏ హఫీజ్‌ఖాన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. నవరత్నాల్లో భాగంగా వక్ఫ్‌బోర్డు భూములు పరిరక్షణకు కృషిచేస్తానని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి హామీ ఇచ్చారని గుర్తుచేశారు. వక్ఫ్‌బోర్డు భూములు కబ్జాకు గురయ్యాయని ఫిర్యాదు అందడంతో ఆదివారం ఏపీ వక్ఫ్‌బోర్డు సీవో ఆలీబాషాతో కలిసి ఎమ్మెల్యేలు కాటసాని రాంభూపాల్‌ రెడ్డి, ఎంఏ హఫీజ్‌ఖాన్‌, […]

Read More
స్వామి అగ్నివేశ్​ఇక లేరు

స్వామి అగ్నివేశ్​ ఇకలేరు

న్యూఢిల్లీ: ఆర్యసమాజ్‌ నేత, ప్రముఖ సామాజిక కార్యకర్త స్వామి అగ్నివేశ్‌ (80) శుక్రవారం కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆరోగ్యపరిస్థితి విషమించడంతో మృత్యువాతపడ్డారు. 1939 సెప్టెంబర్‌ 21న ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లాలో స్వామి అగ్నివేశ్‌ జన్మించారు. చిన్నతనంలోనే తల్లిదండ్రులు చనిపోవడంతో తాతగారి స్వగ్రామం చత్తీస్ ఘడ్ కు వెళ్లిపోయారు. అనంతరం కలకత్తాలోని సెయింట్‌ జేవియర్‌ కాలేజ్‌ నుంచి లా, కామర్స్‌ డిగ్రీ చదివారు. ఆర్యసభ పేర రాజకీయ పార్టీని స్థాపించి హర్యానా నుంచి అసెంబ్లీకి ఎమ్మెల్యేగా […]

Read More
జనసేనాని ధర్మదీక్ష

జనసేనాని ధర్మదీక్ష

సారథి న్యూస్, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ​రాష్ట్రంలో ఆలయాలపై జరుగుతున్న దాడులను నిరసిస్తూ.. సనాతన ధర్మాన్ని పరిరక్షించుకోవాలని పిలుపునిస్తూ శుక్రవారం సాయంత్రం 5.30 గంటలకు దీపాలు వెలిగించే కార్యక్రమానికి జనసేన అధినేత పవన్​కళ్యాణ్ శ్రీకారం చుట్టారు. తన వ్యవసాయ క్షేత్రంలో దీపాన్ని వెలిగించి ‘ధర్మాన్ని పరిరక్షిద్దాం.. మత సమరస్యాన్ని కాపాడుకుందాం’ అని సంకల్పం చెప్పుకొంటూ ధ్యానం చేశారు. ధర్మాన్ని రక్షించుకునే దిశగా అందరూ అడుగులు వేయాలని ఆయన ఆకాంక్షించారు.

Read More
ఏపీలో 8,368 కరోనా కేసులు

ఏపీలో 8,368 కరోనా కేసులు

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో సోమవారం(24 గంటల్లో) 8,368 కరోనా కేసుల నిర్ధారణ అయ్యాయి. రాష్ట్రంలో ఇప్పటివరకు మొత్తం కేసుల సంఖ్య 5,06,493కు చేరింది. తాజాగా, 70 మంది కరోనా బారినపడి మృతిచెందారు. మొత్తంగా కరోనా మృతుల సంఖ్య 4,487కు చేరింది. ఈ మేరకు ఏపీ వైద్యారోగ్యశాఖ హెల్త్​బులెటిన్​ను విడుదల చేసింది. 24 గంటల్లో 10,055 మంది కోవిడ్‌ నుంచి కోలుకుని డిశ్చార్జ్‌ కాగా, ఇప్పటివరకు మొత్తంగా 4,04,074 మంది డిశ్చార్జ్‌ అయ్యారు. ఒకేరోజు 58,187 శాంపిళ్ల టెస్ట్ చేయగా.. […]

Read More
‘వైఎస్సార్ సంపూర్ణ పోషణ’ ప్రారంభం

‘వైఎస్సార్ సంపూర్ణ పోషణ’ ప్రారంభం

సారథి న్యూస్, కర్నూలు: తాడేపల్లి క్యాంపు ఆఫీసును నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ‘వైఎస్సార్‌ సంపూర్ణ పోషణ’ పథకాన్ని ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోమవారం ప్రారంభించారు. వైఎస్సార్ సంపూర్ణ పోషణ (ప్లస్) పథకం ద్వారా జిల్లాలో మైదాన ప్రాంతం, చెంచు గిరిజన కాలనీల్లో ఉన్న 3,549 అంగన్​వాడీ కేంద్రాల్లో నమోదైన 3,93,472 మంది చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు అంగన్​వాడీ కేంద్రాల ద్వారా సంపూర్ణ పోషకాహారాన్ని అందిస్తున్నారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్​ జగన్​మోహన్​రెడ్డి […]

Read More
ఏపీలో 10,825 కరోనా కేసులు

ఏపీలో 10,825 కరోనా కేసులు

అమరావతి: ఆంధ్రప్రదేశ్​లో శనివారం(24గంటల్లో) 10,825 పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయ్యాయి. ఇప్పటివరకు రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 4,87,331కు చేరింది. కొత్తగా 71 మంది కరోనా వ్యాధితో మృతిచెందారు. దీంతో ఇప్పటివరకు మృతుల సంఖ్య 4,347కు చేరింది. 24 గంటల్లో 11,941మంది కోలుకుని డిశ్చార్జ్‌ కాగా, ఇప్పటివరకు మొత్తం 3,82,104 మంది డిశ్చార్జ్‌ అయ్యారు. 24 గంటల్లో 69,326 శాంపిళ్లను పరీక్షించారు. ఇప్పటివరకు 40,35,317 శాంపిళ్లను టెస్ట్​చేశారు. రాష్ట్రంలో ప్రస్తుతం 1,01,210 యాక్టివ్‌ కేసులు రికార్డు అయ్యాయి. […]

Read More

అక్టోబర్ 17 నుంచి అమ్మవారి బ్రహ్మోత్సవాలు

విజయవాడ: అక్టోబర్ 17 నుంచి ఇంద్రకీలాద్రిపై శ్రీ శార్వరి నామ సంవత్సర దసరా మహోత్సవాలు ప్రారంభంకానున్నాయి. 9 రోజుల పాటు పది అలంకారాలలో దుర్గమ్మ దర్శనమిస్తారు. కోవిడ్ నేపథ్యంలో టైం స్లాట్ బుక్ చేసుకున్న వారికి మాత్రమే దసరాలో అమ్మవారి దర్శనానికి అనుమతించే అవకాశం ఉంది. రోజుకు 9 వేలా లేక సంఖ్య పెంచాలా అన్న దానిపై అధికారుల తర్జనబర్జనలో ఉన్నారు. గత ఏడాది దసరాలో రోజుకు లక్షపైనే అమ్మవారిని భక్తులు దర్శనం చేసుకున్నారు. ఈ ఏడాది […]

Read More
అక్రమంగా తరలిస్తున్న మద్యం పట్టివేత

అక్రమంగా తరలిస్తున్న మద్యం పట్టివేత

సారథి న్యూస్, కర్నూలు: పొరుగు రాష్ట్రాల నుంచి మద్యంను పరిమితి స్థాయిలో సరఫరా చేసుకోవచ్చని ఇటీవల ఏపీ హైకోర్టు తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. కానీ మద్యం విక్రయించడం ద్వారా సులువుగా డబ్బు సంపాదించాన్న లక్ష్యంతో పెద్దమొత్తంలో తెంగాణ, కర్ణాటక నుంచి కొందరు మద్యం తెప్పిస్తున్నారు. గురువారం కర్నూలు మండలం జి.సింగవరం గ్రామం వద్ద సీఐ రాజశేఖర్‌ గౌడ్‌ నేతృత్వంలో పోలీసు వాహనాలను తనిఖీచేయగా పెద్దమొత్తంలో మద్యం సీసాలు పట్టుబడ్డాయి. కల్లూరు మండలం దూపాడుకు చెందిన బోయ […]

Read More