సారథి, రామడుగు: దేశ స్వాతంత్ర్య ఉద్యమంలో ఏఐఎస్ఎఫ్ కీలక భూమిక పోషించిందని జిల్లా అధ్యక్షుడు మచ్చ రమేష్ గుర్తుచేశారు. గురువారం ఏఐఎస్ఎఫ్ 86వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏఐఎస్ఎఫ్ జెండా ఎగరవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు చదువు, పోరాడు అనే నినాదంతో ఉద్యమిస్తున్న ఏకైక విద్యార్థి సంఘం ఏఐఎస్ఎఫ్ మాత్రమేనని అన్నారు. భగత్ సింగ్ లాంటి దేశభక్తులను ఆదర్శంగా తీసుకొని శాస్త్రీయ విద్యావిధానం, కామన్ స్కూలు విధానం కోసం పోరాటం […]
సారథి న్యూస్, హుస్నాబాద్: డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ పరీక్ష కేంద్రాన్ని హుస్నాబాద్ డివిజన్ కేంద్రంలోనే కొనసాగించాలని ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి జెరిపోతుల జనార్ధన్ డిమాండ్ చేశారు. హుస్నాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ ఆకుల రజితకు వినతిపత్రం అందజేసి మాట్లాడారు. 15ఏళ్లుగా అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ స్టడీ సెంటర్ హుస్నాబాద్ లో ఉండడం ద్వారా ఏటా 1500 నుంచి 2000 మంది విద్యకు దూరమైన యువతీ యువకులకు ఉన్నత విద్యనభ్యసించే అవకాశం కలిగిందన్నారు. ప్రస్తుతం […]
సారథి న్యూస్, రామగుండం: పెద్దపల్లి జిల్లా రామగుండంలో బుధవారం అఖిలభారత విద్యార్థి సమాఖ్య (ఏఐఎస్ఎఫ్) ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించారు. సీపీఐ నగర కార్యదర్శి కె.కనకరాజు జెండాను ఆవిష్కరించారు. ఏఐఎస్ఎఫ్ మతోన్మాద శక్తులకు వ్యతిరేంగా పోరాటాన్ని కొనసాగిస్తుందని చెప్పుకొచ్చారు. కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ నగర అధ్యక్ష, కార్యదర్శులు రేణుగుంట ప్రీతం, ఈర్ల రామచందర్ పాల్గొన్నారు.