సీనియర్ నటి జయంతి ఆరోగ్యపరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. ప్రస్తుతం ఆమె బెంగళూరులోని ఓ ఆస్పత్రిలో చికిత్సపొందుతున్నారు. ఆమె శ్వాసతీసుకోవడంలో ఇబ్బంది పడుతూ ఆస్పత్రిలో చేరినట్టు ఆమె కుమారుడు తెలిపారు. ప్రస్తుతం జయంతికి వెంటిలేటర్‌పై చికిత్స నందిస్తున్నారు. ఆమెకు కరోనా టెస్టులు నిర్వహించగా, నెగిటివ్ గా తేలినట్టుగా తెలిపారు. ఆమె చాలాకాలంగా ఆస్తమాతో బాధపడుతున్నట్టుగా సమాచారం. తెలుగు, కన్నడ, తమిళ, మరాఠి భాషల్లోని పలు చిత్రాల్లో జయంతి నటించారు. 1960లో ఆమె నటిగా కెరీర్ ఆరంభించారు. హీరోయిన్ […]
తన అందంతో దక్షిణాదిని మెస్మరైజ్ చేసిన అందాల భామ త్రిష ఓ వెబ్‌సీరిస్‌లో నటించనున్నట్టు సమాచారం. ఈ చిత్రంలో ఆమె రొమాంటిక్‌గా నటించనుందట. కరోనా దెబ్బకు ప్రముఖ హీరోయిన్లందరూ డిజిటల్ స్ట్రీమింగ్ వైపు వెళ్లున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో హీరోయిన్స్ వెబ్ సిరీస్ కథల్లో నటించేందుకు సై అంటున్నారు. కాగా ఇప్పటికే స్టార్ హీరోయిన్ సమంత ‘థ ఫ్యామిలీ మాన్’ అనే వెబ్ సిరీస్ రెండో సీజన్ లో నటించింది. అలాగే కాజల్ అగర్వాల్ కూడా […]
బాలయ్య, బోయపాటి కాంబినేషన్లో తెరకెక్కనున్న చిత్రంలో హీరోయిన్ ఎవరా అని కొంతకాలంగా ఫ్యాన్స్, సినీ ప్రియులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. దీనిపై ఆ చిత్ర దర్శకుడు బోయపాటి క్లారిటీ ఇచ్చాడు. ఈ చిత్రంలో అమలాపాల్ హీరోయిన్గా ఎంపికైందని ఇటీవల సోషల్‌మీడియాలో తెగ ప్రచారం జరిగింది. దీంతో నేరుగా బోయపాటి హీరోయిన్ విషయంపై క్లారిటీ ఇచ్చాడు. ఈ చిత్రం ద్వారా ఓ కొత్తనటిని పరిశ్రమకు పరిచయం చేస్తున్నామని చెప్పాడు. అమలా పాల్ నటిస్తుందన్న వార్తలో నిజం లేదన్నాడు. ఇక ఈ […]
ప్రముఖ సినీనటి, కర్ణాటకలోని మాండ్య ఎంపీ సుమలతకు కరోనా సోకింది. ఈ విషయాన్ని స్వయంగా ఆమె ఫేస్బుక్లో పోస్టుచేశారు. ‘శనివారం నుంచి తలనొప్పి, గొంతునొప్పితో బాధపడుతున్నాను. దీంతో అనుమానం వచ్చి కరోనా టెస్ట్ చేయించుకోగా పాజిటివ్ అని తేలింది. ప్రస్తుతం హోంక్వారంటైన్లోనే ఉన్నాను. డాక్టర్ల సూచనలతో మందులు వాడుతున్నాను. త్వరలోనే కోలుకుంటానన్న నమ్మకం ఉంది’ అని ఆమె పేర్కొన్నారు. కరోనా సోకినవారెవరూ ఆందోళన చెందొద్దని.. ధైర్యంగా ఉండి మందులు వాడాలని సూచించారు.
‘ఐస్‌క్రీం’ ఫేం తేజస్వీ ముదివాడ.. కమిట్మెంట్ అనే ఓ చిత్రంలో కథానాయికగా నటిస్తున్నది. శుక్రవారం ఆమె పుట్టినరోజు సందర్భంగా చిత్రయూనిట్ ఓ హాట్ పోస్టర్‌ను విడుదల చేసింది. ఇప్పటికే పలు చిత్రాల్లో తేజస్విని క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటించినప్పటికీ సరైన గుర్తింపు రాలేదు. బిగ్‌బాస్ సీజన్2లో పాల్గొని కొంత పాపులర్ అయ్యింది. తాజాగా ఇప్పడో రొమాంటిక్ చిత్రంలో నటిస్తున్నది. ఈ చిత్రంలో ఆమె కొంత బోల్డ్‌గానే నటించనున్నట్టు సమాచారం. సినీ పరిశ్రమలో ఉండే మోసాలు, వేధింపులే ప్రధానకథాంశంగా ఈ […]
నటీ, నటుల వ్యక్తిగత జీవితాలపై రూమర్లు రావడం కొత్తేమీ కాదు. ఎంతో మంది సెలబ్రిటీలు తమ మీద వచ్చిన పుకార్లకు వివరణ ఇచ్చుకోలేక తలలు పట్టుకుంటారు. తాజాగా కన్నడ నటి, బిగ్‌బాస్ సీజన్ 3 ఫేమ్ నేహా గౌడ తల్లి అయ్యిందని ఆమె యూఎస్‌లోని కాలిఫోర్నియాలో పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిందని పలు కన్నడ సైట్లు రాశాయి. ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో ఆమె స్పందించారు. ఈ వార్తలో నిజం లేదని తేల్చిచెప్పారు. తనను […]
తనను కొందరు బెదిరిస్తున్నారంటూ టాలీవుడ్ నటి పూర్ణ పోలీసులను ఆశ్రయించారు. లాక్ డౌన్‌తో ఆమె కొన్ని రోజులుగా సొంత రాష్ట్రమైన కేరళలోనే ఉంటున్నారు. అయితే ఓ నలుగురు వ్యక్తులు సోషల్‌మీడియా ద్వారా ఆమెను బెదిరించారు. ఏ విషయంలో బెదిరించారన్న విషయం ఆమె స్ఫష్టంగా చెప్పడం లేదు. నలుగురు వ్యక్తలు తనను డబ్బుల కోసం బెదిరిస్తున్నారని ఆమె కుటుంబసభ్యులతో కలిసి సైబర్‌క్రైం పోలీసులను ఆశ్రయించారు. రంగంలోకి దిగిన పోలీసులు విచారణ చేపట్టి డబ్బులు డిమాండ్ చేస్తున్న నలుగురు సభ్యుల […]