Breaking News

TELANGANA

తెలంగాణలో కరోనాతో 8 మంది మృతి

తెలంగాణలో కరోనాతో 8 మంది మృతి

సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణలో సోమవారం కొత్తగా 1,473 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు 55,532 పాజిటివ్ కేసుల నిర్ధారణ అయ్యాయి. రాష్ట్రంలో మహమ్మారి బారినపడి ఇప్పటి వరకు 8 మంది చనిపోయారు. ఇప్పటి వరకు 471 మంది మృత్యువాతపడ్డారు. చికిత్స అనంతరం 42,106 మంది డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య 12,955కు చేరింది. జిల్లాల వారీగా పరిశీలిస్తే.. అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 506 నిర్ధారణ అయ్యాయి. రంగారెడ్డి 168, వరంగల్​ అర్బన్​111, […]

Read More
సెక్రటేరియట్​ కూల్చివేత.. మీడియాకు పర్మిషన్​

సెక్రటేరియట్​ కూల్చివేత.. మీడియాకు పర్మిషన్​

సారథి న్యూస్​, హైదరాబాద్​: తెలంగాణ సెక్రటేరియట్ నూతన భవనం నిర్మాణం కోసం ప్రభుత్వం పాత భవనాల కూల్చివేత, శిథిలాల తొలగింపు చేపట్టింది. ఇప్పటికే దాదాపు 90 శాతం కూల్చివేత పనులు పూర్తయ్యాయి. శిథిలాలు మొత్తం దాదాపు 4500 లారీల లోడు ఉంటుందని అంచనా. ఇందులో ఇప్పటికే రెండువేల లారీల ట్రిప్పులు ఎత్తివేశారు. మిగతా పనులు చకచకా సాగుతున్నాయి. ఎత్తయిన భవనాలను కూల్చివేసే సందర్భంలో ప్రమాదం జరిగే అవకాశం పొంచి ఉండడంతో ముందు జాగ్రత్త చర్యగా ప్రభుత్వం ఎవరినీ […]

Read More
కరోనా వస్తే చావే శరణ్యమా?

కరోనా వస్తే చావే శరణ్యమా?

హైదరాబాద్ లో నివాసం ఉండే చిరు వ్యాపారికి కరోనా ప్రబలింది. కుటుంబసభ్యులు, బంధువులు చిన్నచూపు చూస్తారనే భయంతో వరంగల్ జిల్లాలోని తన సొంతూరుకు వెళ్లి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ తెల్లవారుజామున ఏపీలోని గుంటూరులోని ఓ ఐసోలేషన్ కేంద్రంలోనే మరొకరు ఉరివేసుకుని చనిపోయారు. గురువారం హైదరాబాద్ లో ఎయిర్ ఫోర్స్ రిటైర్ట్ ఉద్యోగి ప్రైవేట్​ ఆస్పత్రిలోని కిటికీలో నుంచి దూకి బలవన్మరణానికి ఒడిగట్టాడు. కరోనా మహమ్మారి జనాలను భయంతో చంపేస్తోంది.. పొరుగు వారు చూపుతున్న వివక్షకు తోడు.. చనిపోతామేమో […]

Read More
తెలంగాణలో 1,593 కరోనా కేసులు

తెలంగాణలో 1,593 కరోనా కేసులు

సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. 24 గంటల్లో 15,654 మంది నమూనాలను పరీక్షించగా, వారిలో 1,593 మందికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయిందని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది. జీహెచ్‌ఎంసీలో కొత్తగా 641 కరోనా కేసులు నమోదయ్యాయి, శనివారం మీడియా బులెటిన్​ విడుదల చేయని ప్రభుత్వం అన్ని వివరాలతో ఆదివారం రిలీజ్ ​చేసినట్టు ప్రకటించింది. రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 54,059కు చేరింది. ప్రస్తుతం వివిధ ఆస్పత్రుల్లో 12,264 మంది కరోనా […]

Read More
‘సంగంబండ’ నుంచి నీటివిడుదల

‘సంగంబండ’ నుంచి నీటి విడుదల

సారథి న్యూస్, మహబూబ్​నగర్: మక్తల్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని చిట్టెం నర్సిరెడ్డి సంగంబండ రిజర్వాయర్ ఎడమ కాల్వ నుంచి నీటిని శనివారం మంత్రి వి.శ్రీనివాస్​గౌడ్, మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి, నారాయణపేట జడ్పీ చైర్​ పర్సన్ ​వనజ, నారాయణపేట కలెక్టర్ హరిచందన నారాయణపేట ప్రారంభించారు. తెలంగాణలో ప్రతి ఎకరాకు సాగునీరు అందించడమే ప్రభుత్వ సంకల్పమన్నారు. అందుకోసమే సీఎం కేసీఆర్​ ఎన్నో ప్రాజెక్టులకు రూపకల్పన చేశారని కొనియాడారు. జిల్లా ఎస్పీ ఇరిగేషన్ శాఖ అధికారులు, వివిధ గ్రామాల […]

Read More
‘పాలీసెట్‌’ అప్లికేషన్​గడువు పెంపు

‘పాలీసెట్‌’ అప్లికేషన్ ​గడువు పెంపు

హైదరాబాద్: తెలంగాణ పాలీసెట్‌ ఆన్‌లైన్‌ దరఖాస్తు గడువును పెంచుతూ రాష్ట్ర సాంకేతిక విద్య, శిక్షణ మండలి (ఎస్‌బీటెట్‌) నిర్ణయం తీసుకుంది. రూ.300 ఆలస్య రుసుముతో జులై 30వ తేదీ వరకు అప్లై చేసుకోవచ్చని కార్యదర్శి యూవీఎస్‌ఎన్‌ మూర్తి వెల్లడించారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.

Read More
‘ఇంటింటా ఇన్నోవేటివ్’​కు దరఖాస్తు చేసుకోండి

‘ఇంటింటా ఇన్నోవేటివ్’​కు దరఖాస్తు చేసుకోండి

సారథి న్యూస్, మెదక్: ఇంటింటా ఇన్నోవేటర్ కార్యక్రమానికి ఆసక్తి ఉన్నవారు దరఖాస్తు చేసుకోవాలని మెదక్​జిల్లా కలెక్టర్​ఎం. ధర్మారెడ్డి శనివారం సూచించారు. పంద్రాగస్టు రోజున తయారుచేసిన ఆవిష్కరణల ప్రదర్శన ఉంటుందన్నారు. గ్రామీణ, విద్యార్థి, సూక్ష్మ, చిన్నతరహా పరిశ్రమలకు సంబంధించిన ఆవిష్కరణలను ఆన్​లైన్​లో ప్రదర్శించవచ్చని సూచించారు. వివరాలను 9100678543 నంబర్ కు వాట్సాప్ ద్వారా ఈనెల 31వ తేదీ వరకు పంపించాలని కోరారు. మరిన్ని వివరాలకు 83285 99157లో సంప్రదించాలని సూచించారు.

Read More
ఓపెస్​స్కూలు స్టూడెంట్స్​పాస్​

ఓపెస్ ​స్కూల్​ స్టూడెంట్స్ ​పాస్​

సారథి న్యూస్, హైదరాబాద్: ఓపెన్ స్కూల్, ఇంటర్మీడియట్​ విద్యార్థులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో ఇటీవల టెన్త్ ఎగ్జామ్స్ ను రద్దుచేసిన ప్రభుత్వం తాజాగా ఓపెన్ టెన్త్, ఇంటర్ విద్యార్థులందరినీ పాస్ చేస్తూ శనివారం ఉత్తర్వులు జారీచేసింది. అందరికీ 35 మార్కులు ఇవ్వనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. ప్రభుత్వ నిర్ణయంతో విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాగా, కరోనా దృష్ట్యా ఓపెన్ స్కూల్ సొసైటీ డైరెక్టర్ ఎస్.వెంకటేశ్వరవర్మ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. ఈ ప్రతిపాదన […]

Read More