Breaking News

TELANGANA

9.. ఆపై తరగతుల నిర్వహణకు ఏర్పాట్లు చేయండి

9.. ఆపై తరగతుల నిర్వహణకు ఏర్పాట్లు చేయండి

సారథి న్యూస్, హైదరాబాద్: ఫిబ్రవరి 1వ తేదీ నుంచి 9వ తరగతి.. ఆపై క్లాసెస్​ నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధికారులకు సూచించారు. ఈ మేరకు సోమవారం ప్రభుత్వ సలహాదారులు, ఆయాశాఖల కార్యదర్శులు, విభాగాధిపతులతో సమావేశం నిర్వహించారు. రెవెన్యూకు సంబంధించిన అన్నిరకాల సమస్యలను సత్వరమే పరిష్కరించాలని ఆదేశించారు. ధరణి పోర్టల్ లో అవసరమైన అన్నిరకాల మార్పులు, చేర్పులను వారం రోజుల్లోగా పూర్తిచేయాలని సూచించారు. కరోనా వ్యాక్సినేషన్ కోసం ఏర్పాట్లు వెంటనే పూర్తిచేయాలని ఆదేశించారు. […]

Read More
ముదిరాజ్​కులస్తుల అభ్యున్నతికి కృషి

ముదిరాజ్ ​కులస్తుల అభ్యున్నతికి కృషి

సారథి న్యూస్, హైదరాబాద్: ముదిరాజ్ కులస్తుల సమస్యలు పరిష్కరించి, వారి అభ్యున్నతికి కృషిచేస్తానని వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ ​స్పష్టంచేశారు. హైదరాబాద్​లోని కోకాపేట్​లో ముదిరాజ్​కులస్తులకు ప్రభుత్వం కేటాయించిన ఐదెకరాల స్థలంలో నిర్మించనున్న భవన నిర్మాణానికి ఆదివారం మంత్రులు, ఎమ్మెల్యేలతో కలిసి భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా మంత్రి ఈటల మాట్లాడుతూ.. స్థలం కేటాయించినందుకు సీఎంకు కృతజ్క్షతలు తెలిపారు. చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణలో ముదిరాజ్ కులస్తులు లేని ఊరు, చేప తిననివారు లేరని వివరించారు. […]

Read More
కోరమీసాల మల్లన్నకోటి దండాలు

కోరమీసాల మల్లన్న కోటి దండాలు

కొమురెల్లి మల్లికార్జునస్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభం 13 వారాల పాటు జానపదుల జనజాతర సారథి న్యూస్, హుస్నాబాద్: తెలంగాణ, జానపద సంస్కృతీ సంప్రదాయానికి ప్రతీకగా నిలిచి.. అరుదైన పడమటి శివాలయంగా పేరొందిన కోరమీసాల కొమురవెల్లి మల్లికార్జున స్వామి బ్రహ్మెత్సవాలు ప్రారంభమయ్యాయి. ఏటా మార్గశిరమాసం చివరి ఆదివారం నిర్వహించే స్వామివారి కల్యాణ వేడుకతో బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ చేశారు. జనవరి 10న ప్రారంభమయ్యే ఉత్సవాలు మూడు నెలల పాటు 13వారాలు కొనసాగి ఫాల్గుణ మాసం ఆదివారం ఏప్రిల్ 11న అగ్నిగుండాల కార్యక్రమంతో […]

Read More
ప్రమోషన్ల వివరాలు రెడీ చేయండి

ప్రమోషన్ల రిపోర్టు రెడీ చేయండి

సారథి న్యూస్, హైదరాబాద్: సీఎం కె.చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు సెక్రటేరియట్ హెచ్ఎండీవోలు, జిల్లాస్థాయిలో ఉద్యోగుల ప్రమోషన్లు ఎలాంటి జోక్యం లేకుండా జనవరి 31వ తేదీలోపు పూర్తిచేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్వర్ కుమార్ ఆదేశించారు. సోమవారం వివిధ శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులతో సమావేశం నిర్వహించారు. ప్రమోషన్ తో పాటు కారుణ్య నియామకాల ప్రక్రియను ఎటువంటి జోక్యం లేకుండా పూర్తి చేయాలన్నారు. ప్రమోషన్లు ఇవ్వడం వల్ల ఖాళీలను కూడా ప్రత్యక్ష […]

Read More
ఎస్సీ, ఎస్టీ యువత ఆర్థికంగా ఎదగాలె

ఎస్సీ, ఎస్టీ యువత ఆర్థికంగా ఎదగాలె

సారథి న్యూస్, హైదరాబాద్: ఎస్సీ, ఎస్టీ యువత పారిశ్రామికవేత్తలుగా ఎదిగేందుకు అవసరమైన సహాయం అందించడంతో పాటు ఉద్యోగావకాశాలు కల్పించేందుకు సీఎం కె.చంద్రశేఖర్​రావు కట్టుబడి ఉన్నారని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్వర్ కుమార్ తెలిపారు. సోమవారం బీఆర్కే భవన్ లో డీఐసీసీఐ (దళిత్ ఇండియా ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్) బృందం ప్రభుత్వ కార్యదర్శిని కలిసి 2021 నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దళిత గిరిజన యువత పారిశ్రామికరంగంలో […]

Read More
ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం గుడ్​న్యూస్​

ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం గుడ్​న్యూస్​

సారథి న్యూస్, హైదరాబాద్: నూతన సంవత్సర కానుకగా రాష్ట్రంలోని అన్నిరకాల ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలు పెంచాలని, ఉద్యోగ విరమణ వయస్సును పెంచాలని, అన్నిశాఖల్లో ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ప్రారంభించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. మంగళవారం ఆయన ప్రగతిభవన్​లో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రభుత్వ ఉద్యోగులు, గ్రాంట్ ఇన్ ఎయిడ్ ఉద్యోగులు, వర్క్ చార్జ్​డ్ ఉద్యోగులు, డెయిలీ వేజ్ ఉద్యోగులు, ఫుల్ టైమ్ కాంటింజెంట్ ఉద్యోగులు, పార్ట్ టైమ్ కాంటింజెంట్ ఉద్యోగులు, హోంగార్డులు, […]

Read More
సీఎంను కలిసిన మహిళా కమిషన్​చైర్​పర్సన్​సునీతా లక్ష్మారెడ్డి

సీఎంను కలిసిన మహిళా కమిషన్​ చైర్​పర్సన్ ​సునీతా లక్ష్మారెడ్డి

సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌గా నియమితులైన వి.సునీతా లక్ష్మారెడ్డి, సభ్యులు గద్దల పద్మ, రేవతిరావు, సూదం లక్ష్మి, ఈశ్వరీబాయి, షాహీన్ అఫ్రోజ్, కొమ్ము ఉమాదేవి సోమవారం ప్రగతిభవన్ లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావును మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ ​వారికి శుభాకాంక్షలు తెలిపారు. వారి వెంట మహిళా, గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్​ ఉన్నారు.

Read More
సిటీలో న్యూ ఇయర్ వేడుకలపై ఆంక్షలు

సిటీలో న్యూ ఇయర్ వేడుకలపై ఆంక్షలు

సారథి న్యూస్, హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలో నూతన సంవత్సర వేడుకలపై రాష్ట్ర ప్రభుత్వం నిషేధం విధించింది. నగరంలో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్‌కు అనుమతి లేదని సైబరాబాద్ సీపీ సజ్జనార్ స్పష్టం చేశారు. పబ్‌లు, క్లబ్బులు, బార్లకు పర్మిషన్ లేదన్నారు. స్టార్ హోటళ్లలో రోజువారీ కార్యక్రమాలకు అనుమతిచ్చారు. విస్తృతంగా డ్రంకెన్​ డ్రైవ్ ​తనిఖీలు నిర్వహిస్తామని స్పష్టం చేశారు. నిబంధనలు పాటించకపోతే కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు. అలాగే న్యూ ఇయర్​ వేడుకల నేపథ్యంలో ప్రతిరోజు డ్రంకెన్​ […]

Read More