Breaking News

TELANGANA

కరోనా టెస్టులు పెంచండి

సారథి న్యూస్, రామాయంపేట/రామడుగు: రాష్ట్రంలో కరోనా టెస్టుల సంఖ్య పెంచాలని భారతీయ జనతాపార్టీ డిమాండ్​ చేసింది. కరోనా వార్డుల్లో పనిచేసే సిబ్బందికి, డాక్టర్లకు పీపీఈ కిట్లు ఇవ్వాలని కోరింది. మెదక్ జిల్లా రామాయంపేట ప్రభుత్వ దవాఖాన ఎదుట, కరీంనగర్​ జిల్లా రామడగులోనూ బీజేపీ నేతలు సోమవారం ఆందోళన చేపట్టారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఆయుష్మాన్​ భారత్​ స్కీమ్​లో చేర్చాలని డిమాండ్​ చేశారు. కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చాలన్నారు. కార్యక్రమంలో రామడుగు బీజేపీ మండల అధ్యక్షుడు ఒంటెల కర్ణాకర్ రెడ్డి, రామయంపేట […]

Read More

కల్లాల నిర్మాణాలు ముమ్మరం

సారథి న్యూస్, రామాయంపేట: రైతులు తాము పండించిన పంటలను అరబెట్టుకోవాడానికి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో రైతుల కష్టాలను తెలుసుకున్న ప్రభుత్వం స్వయంగా కల్లాలను నిర్మించేందుకు ఉపాధిహామీ నిధులు మంజూరు చేశారు. కల్లాల నిర్మాణం కోసం మెదక్​ జిల్లాకు 22.7 కోట్లు నిధులను కేటాయించారు. జిల్లాలోని 20 మండలాల్లో కల్లాలను నిర్మించనున్నారు.కల్లాల నిర్మాణానికి వీళ్లు అర్హులుపంట నూర్పిడి కల్లాల నిర్మాణం కోసం చిన్న, సన్నకారు రైతులు, స్వయం సహాయక సంఘాల సభ్యులు అర్హులు. వీరిలో ఎస్సీ, ఎస్టీ […]

Read More
షార్ట్ న్యూస్

‘పది’ విద్యార్థులకు గ్రేడ్లు

సారథి న్యూస్​,హైదరాబాద్‌: తెలంగాణలో పదో తరగతి విద్యార్థులకు గ్రేడ్లు ఖరారయ్యాయి. మధ్యాహ్నం మూడు గంటల నుంచి www.bse.telangana.gov.in వెబ్‌సైట్‌లో వివరాలు చూసుకోవచ్చని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. మెమోలు తమ పాఠశాలలో తీసుకోవాలని సూచించారు. పొరపాట్లు ఉంటే పాఠశాల ద్వారా ఎస్‌ఎస్‌సీ బోర్డుకు తెలియజేయాలన్నారు.

Read More

తెలంగాణలో మూడ్రోజులు వర్షాలు

సారథిన్యూస్​, హైదరాబాద్​; ఒడిశా దాని పరిసర ప్రాంతాల్లో మొదలైన ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్నది. దీని ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలో రాగల మూడురోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. గంటకు 30 నుంచి 40 కి.మీ వేగంతో ఈదురు గాలులు వీస్తాయని, అక్కడక్కడ ఉరుములతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని వారు పేర్కొన్నారు. కుమ్రంభీం ఆసిఫాబాద్​, మంచిర్యాల, పెద్దపల్లి, కరీంనగర్​, జయశంకర్​ భూపాలపల్లి, ములుగు, వరంగల్​ అర్బన్​, వరంగల్​ రూరల్​, జనగామ, […]

Read More

రైతు బలవన్మరణం

సారథి న్యూస్​,పెద్దపల్లి: రెవెన్యూ అధికారుల తన భూమిని రికార్డుల్లో ఎక్కించకపోవడంతో మనస్తాపం చెందిన ఓ రైతు ప్రాణాలు తీసుకున్నాడు. ఈ ఘటన పెద్దపల్లి జిల్లా శ్రీరాంపూర్​ తహసీల్దార్​ కార్యాలయం ఎదుట చోటుచేసుకున్నది. తనకున్న ఎకరం 20 గుంటల భూమిని తన పేరు మీద నమోదు చేయవలసిందిగా వీణవంక మండలం రెడ్డిపల్లికు చెందిన మందల రాజారెడ్డి అనే రైతు కొంతకాలంగా రెవెన్యూ అధికారుల చుట్టూ తిరుగుతున్నాడు. ఎన్ని సార్లు దరఖాస్తు చేసుకున్నా అధికారులు పట్టించుకోకపోవంతో మనస్తాపంతో పురుగుల మందు […]

Read More

సంతోష్ బాబు ఇంటికి నేనే వెళ్తా

సారథిన్యూస్​, హైదరాబాద్​: కల్నల్ సంతోష్ బాబు కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తుందని సీఎం కేసీఆర్​ ప్రకటించారు. ఆయన కుటుంబానికి ప్రభుత్వం తరుఫున రూ.5 కోట్ల నగదు, నివాస స్థలం, సంతోష్​ బాబు భార్యకు గ్రూప్ 1 స్థాయి ఉద్యోగం ఇవ్వనున్నట్టు ప్రకటించారు. ఈ మేరకు శుక్రవారం ప్రధానీ మోదీ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్​లో సీఎం కేసీఆర్​ మాట్లాడుతూ.. తానే స్వయంగా సంతోష్ బాబు ఇంటికి వెళ్లి సహాయం అందించనున్నట్లు వెల్లడించారు. ఇదే ఘర్షణలో మరణించిన మిగతా […]

Read More

పారిశుద్ధ్యానికే ప్రాధాన్యం

సారథి న్యూస్, రామాయంపేట: రాష్ట్రప్రభుత్వం పారిశుద్ధ్యానికే అధిక ప్రాధాన్యమిస్తున్నదని రామాయంపేట డిప్యూటీ కమిషనర్​ రవీందర్​ పేర్కొన్నారు. రాష్ట్రంలోని ప్రతిగ్రామంలో డంపింగ్​ యార్డులను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ఈ మేరకు ఆయన మెదక్ డీపీవో హనోక్ తో కలసి నిజాంపేట మండలం చల్మేడ గ్రామంలో డంపింగ్ యార్డ్ ను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇంటి దగ్గరే తడి, పొడి చెత్తను వేరు చేసి పారిశుద్ధ్య కార్మికులకు అందించాలని సూచించారు. కార్యక్రమంలో సర్పంచ్ నరసింహ రెడ్డి, ఎంపీపీ […]

Read More

ఒకేరోజు 302 కేసులు

సారథి న్యూస్​, హైదరాబాద్‌: తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. రాష్ట్రంలో గురువారం రికార్డు స్థాయిలో 352 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, ముగ్గురు మృతిచెందారు. తాజాగా జీహెచ్‌ఎంసీ పరిధిలోనే 302 కేసులు ఉన్నాయి. మొత్తంగా కరోనా కేసుల సంఖ్య 6,027కు చేరింది. గురువారం ముగ్గురు కరోనాతో మృతిచెందడంతో మొత్తం మృతుల సంఖ్య 195గా నమోదైంది. ఇప్పటివరకు వివిధ ఆస్పత్రుల్లో కరోనా నుంచి కోలుకున్న 3,301 మంది డిశ్చార్జ్​ అయ్యారు. మేడ్చల్​ జిల్లాలో 10, […]

Read More