Breaking News

CARONA

ఢిల్లీలో తగ్గుతున్న కేసులు

ఢిల్లీలో తగ్గుతున్న కరోనా

ఢిల్లీ: ఢిల్లీ రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతున్నది. గత 24 గంటల్లో కేవలం 1,211 కొత్తకేసులు మాత్రమే నమోదయ్యాయి. జూన్​ 9 నుంచి ఇంత తక్కువ కేసులు నమోదవడం ఇదే తొలిసారి. కాగా ఇప్పటి వరకు ఈ రాష్ట్రంలో 1,22,793 మంది కరోనా బారిన పడ్డారు. 3,628 మంది ప్రాణాలు కోల్పోయారు. గత 24 గంటల్లో 31 మంది మృతిచెందారు.

Read More
‘కరోనా’ ట్రయల్స్‌కు మీరు రెడీనా?

‘కరోనా’ ట్రయల్స్‌కు మీరు రెడీనా?

న్యూఢిల్లీ: మన దేశంలో అభివృద్ధి చేసిన కరోనా వ్యాక్సిన్‌ హ్యూమన్‌ ట్రయల్స్‌ నిర్వహించేందుకు వలంటీర్లు కావాలని ఢిల్లీలోని ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (ఎయిమ్స్‌) ప్రకటించింది. సోమవారం నుంచి క్లినికల్‌ ట్రయల్స్‌ షురూ చేసేందుకు పర్మిషన్‌ వచ్చిన నేపథ్యంలో ఆరోగ్యంగా ఉన్న వ్యక్తులు నమోదు చేసుకోవాలని చెప్పింది. క్లినికల్‌ ట్రయల్స్‌ నిర్వహించేందుకు ఎయిస్‌ ఎథిక్స్‌ కమిటీ ఒప్పుకోవడంతో ఈ ప్రకటన రిలీజ్‌ చేశారు. మొదటి ఫేజ్‌లో 375 మందిపై ఈ వ్యాక్సిన్‌ ప్రయోగించాల్సి ఉండగా, […]

Read More
నాగర్​కర్నూల్​లో విస్తరిస్తున్న కరోనా

నాగర్​కర్నూల్​ జిల్లాలో 13 కొత్తకేసులు

సారథిన్యూస్​, నాగర్​కర్నూల్​: నాగర్​కర్నూల్​ జిల్లాలో కరోనా అంతకంతకూ విస్తరిస్తున్నది. తాజాగా 13 కొత్తకేసులు నమోదైనట్టు డీఎంహెచ్​వో సుధాకర్​ లాల్​ తెలిపారు. నాగర్​కర్నూల్​ పట్టణంలో ఇటీవల కరోనాతో మృతిచెందిన విలేకరి సోదరికి, అతని కోడలుకు కరోనా పాజిటివ్​గా నిర్ధారణ అయ్యింది. నాగర్​కర్నూల్​ మండలం పెద్దాపూర్​కు చెందిన ఓ మహిళకు కరోనా సోకింది. ప్రస్తుతం ఆమె హైదరాబాద్​లోని ఓ దవాఖానలో డయాలసిస్​ చేయించుకుంటున్నది. తిమ్మాజిపేట మండలం నేరెళ్లపల్లిలో మరో ముగ్గురికి కరోనా సోకింది. అచ్చంపేట పట్టణంలో నలుగురికి, బల్మూర్ మండలం […]

Read More

కరోనాతో చెదిరిన చేనేత పరిశ్రమ

ఉపాధి కోసం కూలి పనులకు వెళ్తున్న కార్మికులు చేతులు మొద్దు బారి నేత పని చేయలేకపోతున్నామని ఆవేదన ప్రభుత్వమే గిట్టుబాటు ధరలు కల్పించాలని వేడుకోలు సారథి న్యూస్​, మానవపాడు(జోగుళాంబ గద్వాల): జోగుళాంబ గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గంలోని రాజోలి గ్రామం పేరు చెబితేనే చేనేత గుర్తుకొస్తుంది. తెలుగు రాష్ట్రాల్లో నేత పనికి గుర్తింపు తెచ్చిన వాటిలో ఈ గ్రామం కూడా ఒకటి. అలాంటి ఊరులో చేనేత వృత్తే కనుమరుగయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. వృత్తినే నమ్ముకుని కొన్నేళ్లుగా జీవనం […]

Read More
నితిన్​ పెళ్లి డేట్​ ఫిక్స్​

నితిన్​ పెళ్లి డేట్ ఫిక్స్​

కరోనాతో వాయిదా పడ్డ టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ – షాలిని వివాహానికి ముహూర్తం కుదిరింది. ఏప్రిల్ 16ననే వీరి పెళ్లి జరగాల్సిఉండగా లాక్​డౌన్​తో వాయిదా పడింది. దీంతో జూలై 26న రాత్రి 8.30 నిమిషాలకు వీరి పెళ్లికి ఇరుకుటుంబాల పెద్దలు ముహూర్తం పెట్టించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం నిరాడంబరంగా వివాహ వేడక జరుగనున్నది. ఇరుకుటుంబాల వారు మాత్రమే ఈ వేడుకకు హాజరుకానున్నారు. హైదరాబాద్​లోని ఫలక్ నుమా ప్యాలస్​లో పెళ్లి జరుగనున్నట్టు సమాచారం. భీష్మ సినిమాతో సూపర్హిట్‌ను […]

Read More

38 వేల కొత్తకేసులు

ఢిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా విజృంభణ కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 38,902 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదవడంతో.. మొత్తం కేసుల సంఖ్య 10,77,618 కి చేరింది. ఒక్కరోజులో 38 వేలకు పైగా కేసులు నమోదవడం ఇదే తొలిసారి. కొత్తగా 543 మంది వైరస్‌ బాధితులు మృతి చెందడటంతో మొత్తం మరణాల సంఖ్య 26,816 కు చేరిందని కేంద్ర ఆరోగ్యశాఖ ఆదివారం బులెటిన్‌లో పేర్కొంది. ఇప్పటి వరకు భారత్‌లోని మొత్తం కరోనా రోగుల్లో 6.77 లక్షల మంది కోలుకున్నారు. […]

Read More
మహారాష్ట్రలో పెరుగుతున్న కేసులు

మహారాష్ట్రలో 3 లక్షలు దాటిన కేసులు

ముంబై: మహారాష్ట్రలో కరోనా కేసుల సంఖ్య భారీగా పెరుగుతున్నది. శనివారం రాత్రి వరకు రాష్ట్రంలో 3,00,937 కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో 8,348 కొత్త కేసులు గుర్తించినట్టు అధికారులు తెలిపారు. రాష్ట్రంలో ఇప్పటికే 11,596 మంది కరోనాతో మృతిచెందారు. కాగా లక్షా 65 వేల మంది వ్యాధినుంచి కోలుకున్నారు. దేశంలో అత్యధిక కేసులు మహారాష్ట్రలోనే నమోదవుతున్నాయి.

Read More
కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చాలి

కరోనాను ఆరోగ్యశ్రీ లో చేర్చాలి

సారథిన్యూస్, రామడుగు: కరోనాను వెంటనే ఆరోగ్య శ్రీ లో చేర్చాలని కాంగ్రెస్​ సీనియర్​ నాయకుడు రాజమల్లయ్య ప్రభుత్వాన్ని డిమాండ్​ చేశారు. కరోనాను అదుపుచేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. లాక్​డౌన్​ ఎత్తివేయడంతోనే కరోనా విజృంభించిందని పేర్కొన్నారు. లాక్​డౌన్​ను పటిష్ఠంగా అమలుచేసి ఉపాధి కోల్పోయినవారిని ఆదుకోవాలని డిమాండ్​ చేశారు.

Read More