సారథిన్యూస్, రామడుగు: కరీంనగర్ జిల్లా రామడుగు పంచాయతీ పరిధిలోని పారిశుద్ధ్యపనులను వెంటనే మొదలు పెట్టాలని బీజేపీ నేతలు డిమాండ్ చేశారు. నిధులు విడుదలైనప్పటికీ డంపింగ్యార్డు, శ్మశానవాటిక పనులు ఇంకా ఎందుకు ప్రారంభించలేదని ప్రశ్నించారు. ఈ మేరకు వారు సోమవారం రామడుగు డివిజినల్ పంచాయతీ అధికారికి వినతిపత్రం అందజేశారు. వినతిపత్రం ఇచ్చినవారిలో నాయకులు పురేళ్ల శ్రీకాంత్, అనుపురం పరుశరాం, ఉపసర్పంచ్ రాజేందర్ తదితరులు ఉన్నారు.