చండీగఢ్: హర్యానాకు చెందిన బీజేపీ ఎమ్మెల్యే సుభాష్ సుధాకు కరోనా పాజిటివ్ అని తెలిసింది. సుభాష్ కురుక్షేత్ర జిల్లాలోని థానేసర్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. అయితే ఆయన కొంతకాలంగా జ్వరం, దగ్గుతో బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఓ ప్రైవేట్ దవాఖానకు తీసుకెళ్లి కరోనా టెస్టులు చేయగా పాజిటివ్ అని తెలిందని ఆయన వ్యక్తిగత సహాయకుడు అరుణ్ గులాటి మీడియాకు తెలిపారు. జూన్ 21న సంభవించిన సూర్యగ్రహణం రోజున నిర్వహించిన ఓ పూజలో ఆయన పాల్గొన్నట్టు సమాచారం. ఆ పూజకు […]
సారథి న్యూస్, అలంపూర్: అష్టాదశశక్తి పీఠాల్లో ఐదో శక్తిపీఠమైన తెలంగాణలోని జోగుళాంబ బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయాన్ని చూడామణి సూర్యగ్రహణం సందర్భంగా ఆదివారం అర్చకులు మూసివేశారు. ఉదయమే అమ్మవారికి ధూప దీప నైవేద్యాలను సమర్పించి ఆలయ ద్వారాలకు తాళాలు వేశారు. శుద్ధి సంప్రోక్షణ తర్వాత ప్రత్యేకపూజలు చేసి మహా మంగళహారతితో సోమవారం ఆలయాన్ని తెరవనున్నారు.
ఆకాశంలో మహాద్భుతం.. వలయాకార సూర్యగ్రహణం ప్రజలను ఆశ్యర్యానికి, ఆనందానికి గురిచేయనుంది. వలయాకార సూర్యగ్రహణాలు ఎలా ఉంటుందనే విషయంపైనే చాలామంది టెన్షన్ గా ఎదురుచూస్తున్నారు. ఈ సూర్యగ్రహణంతో కరోనా వైరస్ చనిపోతుందని చాలామంది భావిస్తున్నారు. కానీ, ఈ గ్రహణానికి, కరోనా వైరస్‌కు ఎలాంటి సంబంధం లేదని నిపుణులు చెబుతున్నారు. దీనిని అందరూ చూడొచ్చు. కాకుంటే కొన్ని జాగ్రత్తలు పాటించాలి.2020లో మొట్టమొదటి సూర్యగ్రహణం ఆ రోజు ఏర్పడబోతోంది. జూన్ 21న ఏర్పడబోయేది వలయాకార సూర్య గ్రహణం. చంద్రుడు భూమి చుట్టూ […]