సారథి న్యూస్, మహబూబ్ నగర్: తెలంగాణ రాష్ట్రం నీళ్లు, నిధులు, నియామకాలపై ఏర్పడిన ఆరేళ్ల పాలనలో పాలమూరును పట్టించుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని సీపీఐ మహబూబ్ నగర్ జిల్లా కార్యదర్శి పరమేశ్ గౌడ్ విమర్శించారు. పార్టీ ఆఫీసులో జాతీయజెండా ఆవిష్కరణ అనంతరం అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పించారు. పాలమూరు జిల్లాకు సీఎం కేసీఆర్ చేసిన వాగ్దానాలు అమలుకాలేదని గుర్తుచేశారు. దక్షిణ తెలంగాణపై ఆయన ప్రేమ లేదన్నారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యవర్గసభ్యుడు డి.బాలకిషన్, పి.సురేష్, రైతుసంఘం జిల్లా నాయకులు […]
సారథి న్యూస్, హుస్నాబాద్: విప్లవ రచయితల సంఘం నేత ప్రముఖ న్యాయవాది వరవరరావు, ప్రొఫెసర్ సాయిబాబాను విడుదల చేయాలని సీపీఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు గడిపె మల్లేష్ అన్నారు. ఈ సందర్భంగా టౌన్ లోని అనభేరి, సింగిరెడ్డి భూపతిరెడ్డి అమరుల భవనంలో సోమవారం ఆయన విలేకరులతో ప్రెస్ మీట్ లో మాట్లాడారు. మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రొఫెసర్ సాయిబాబా, వరవరరావును అక్రమంగా అరెస్టు చేసి జైలుకు పంపడం సరికాదన్నారు. ప్రపంచ మహమ్మారి కరోనా […]
సారథి న్యూస్, గోదావరిఖని: నగర పాలక సంస్థలోని గోదావరిఖని పారిశ్రామిక ప్రాంతంలో(కోల్డ్ స్టోరేజ్) శీతల గిడ్డంగులు ఏర్పాటు చేయాలని బుధవారం కమిషనర్ పి.ఉదయ్ కుమార్ కు సీపీఐ నగర సహాయ కార్యదర్శి మద్దెల దినేష్ ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు. రామగుండం నగరంలో మార్కెటింగ్ దినదినాభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో ఇంటిగ్రేటెడ్ మార్కెట్లు ఏర్పాటు చేయడానికి ప్రయత్నిస్తుండడం శుభపరిణామని అన్నారు. ప్రధానంగా కూరగాయలు, పండ్లు, చేపలు వంటివి నిలువ చేసుకోవడానికి గిడ్డంగులు లేకపోవడంతో ఆర్థికంగా తీవ్ర నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. […]
సారథి న్యూస్, హుస్నాబాద్: అఖిల భారత కిసాన్ సభ ఉపాధ్యక్షుడు కొల్లి నాగేశ్వరరావు మరణం సీపీఐకి తీరనిలోటని రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు గడిపె మల్లేష్ అన్నారు. ఈ సందర్భంగా పట్టణంలోని అనభేరి, సింగిరెడ్డి భూపతిరెడ్డి అమరుల భవనంలో ఏర్పాటుచేసిన సమావేశంలో మాట్లాడారు. నాగేశ్వరరావు రైతు, కూలీల హక్కుల సాధనకు సమరశీల పోరాటాలు చేశాడని గుర్తుచేశారు. రైతు సంఘం జిల్లా సహయ కార్యదర్శి హన్మిరెడ్డి, రాజారెడ్డి, జిల్లా కార్యవర్గ సభ్యులు వనేశ్, కోమురయ్య, భాస్కర్, సుదర్శనాచారి, లక్ష్మినారాయణ, ఏఐవైఎఫ్ […]