తెలంగాణ పోరాట యోధురాలు మల్లు స్వరాజ్యం కన్నుమూత నిజాంసర్కారును వణికించిన ధీరవనిత బతుకమ్మ పాటలతో ప్రజల్లో చైతన్యం కొంతకాలంగా తీవ్ర అనారోగ్యం రేపు నల్లగొండలో అంత్యక్రియలు సామాజికసారథి, హైదరాబాద్: సీపీఎం కేంద్ర కమిటీ సభ్యురాలు, తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు, మాజీ ఎమ్మెల్యే మల్లు స్వరాజ్యం(91) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె బంజారాహిల్స్‌లోని కేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అరోగ్య పరిస్థితి విషమించడంతో శనివారం రాత్రి 7.30 గంటల సమయంలో తుదిశ్వాస విడిచారు. ప్రస్తుత సూర్యాపేట […]
న్యూఢిల్లీ : సీపీఎం జనరల్ సెక్రటరీ, సీనియర్ నేత సీతారాం ఏచూరి ఇంట్లో విషాదం నెలకొంది. ఆయన పెద్ద కుమారుడు ఆశిష్ ఏచూరి (35) కరోనాతో కన్నుమూశాడు. గురువారం ఉదయం 5.30 గంటలకు ఆయన గురుగ్రావ్ లోని మేదాంత ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు. రెండు వారాలుగా ఆశిష్ అక్కడే చికిత్స పొందుతున్నాడు. ఈ విషయాన్ని సీతారాం ఏచూరి ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ‘ఈరోజు ఉదయం నా పెద్ద కుమారుడు ఆశిష్ ఏచూరిని కోల్పోయానని తెలియజేయడం నాకు చాలా […]
సారథి న్యూస్, కర్నూలు: సీపీఎం సీనియర్ నేత, పార్టీ కర్నూలు జిల్లా కమిటీ సభ్యుడు టి.షడ్రక్(62)మంగళవారం కరోనాతో తనువు చాలించారు. కొద్దిరోజులుగా తీవ్రమైన జ్వరంతో బాధపడుతుండగా హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. పరిస్థితి విషమించడంతో ప్రాణం విడిచారు. ఆయనకు భార్య, కుమారుడు ఉన్నారు. సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు ఎంఏ గఫూర్ కర్నూలు ఎమ్మెల్యే హఫిజ్‌ఖాన్ సంతాపం ప్రకటించారు. ఆయన మృతి ప్రజాఉద్యమాలకు తీరని లోటని జిల్లా […]